For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. 96 ఏళ్ల టెస్ట్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. ఎక్స్‌ట్రాలు కూడా సింగిల్ డిజిటే!

India vs Australia: Virat Kohli and Co register unwanted record as all 11 batsmen score single-digit scores

అడిలైడ్: దరిద్రం నెత్తిన తాండవం చేస్తున్నప్పుడు అరటి పండు తిన్న పళ్లు ఉడుతాయంటారు! ఆస్ట్రేలియాతో శనివారం ముగిసిన పింక్ టెస్ట్‌లో భారత జట్టుది ఇంచు మించు ఇదే పరిస్థితి. ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. ఎంతటి భీకరమైన బౌలర్లనైనా చెడుగుడుడాడిన చరిత్ర ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి అంతా నేల చూపులు చూశారు. ఫలితంగా భారత్ ఎన్నడూ లేని విధంగా 36 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్ 0-1తో వెనుకబడింది. ఓటమి ఏం కొత్త కాకున్నా.. భారత ఆటగాళ్లు ఆడిన తీరే అందర్ని వేధిస్తోంది.

ఎక్స్‌ట్రాలు సింగిల్ డిజిటే..

ఎక్స్‌ట్రాలు సింగిల్ డిజిటే..

ఈ మ్యాచ్‌లో భారత జట్టుపై దరిద్రం ఎంతలా తాండవం చేసిందంటే..11 మంది బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. ఆఖరికి ఎక్స్‌ట్రాలు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఇలా 11 మంది బ్యాట్స్‌మెన్‌తో పాటు ఎక్స్‌ట్రాలు కూడా ఓ ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్ దాటకపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. 1924లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇలానే జరిగింది. సఫారీ జట్టు ఆ మ్యాచ్‌లో 30కి ఆలౌటవ్వగా.. ఏ ఒక్కరూ సింగిల్ డిజిట్ దాటలేదు. కానీ ఎక్స్‌ట్రాల రూపంలో 11 పరుగులు వచ్చాయి.

కోహ్లీ ఓడిన ఫస్ట్ మ్యాచ్

కోహ్లీ ఓడిన ఫస్ట్ మ్యాచ్

టెస్ట్‌ల్లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ ఓడిన తొలి మ్యాచ్ ఇదే. గతంలో విరాట్ 25 మ్యాచ్‌ల్లో టాస్ గెలవగా.. అందులో 21 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 4 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్ టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న మూడో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మయాంక్ 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకోగా.. వినోద్ కాంబ్లీ(14 ఇన్నింగ్స్), చతేశ్వర్ పుజారా (18 ఇన్నింగ్స్) ఈ లిస్ట్‌లో టాప్-2లో ఉండగా, మయాంక్ మూడో స్థానంలో నిలిచాడు.

25 బంతుల్లోనే 5 వికెట్లు..

25 బంతుల్లోనే 5 వికెట్లు..

ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన హేజిల్ వుడ్ కేవలం 25 బంతుల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ఐదు వికెట్ల స్పెల్. ఆస్ట్రేలియాకే చెందిన ఎర్నీతొషాక్ తన ఫస్ట్ స్పెల్‌లో 19 బంతుల్లోనే ఐదు వికెట్లు సాధించాడు. 1947-48‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఎర్నీ చేసిన ఈ ఫీట్ ఇప్పటిదాకా ‘ఫాస్టెస్ట్ ఫైవ్' రికార్డు. 2015లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ రికార్డును సమం చేశాడు.

అత్యల్ప స్కోర్

అత్యల్ప స్కోర్

టెస్ట్‌ల్లో టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోర్. 1974లో ఇంగ్లండ్‌పై 42 రన్స్‌కు ఆలౌటవ్వడం ఇన్నాళ్లూ చెత్త రికార్డు.. అప్పుడు కూడా భారత్ మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ స్కోర్ చేసింది. శనివారం ఆ రికార్డు బద్దలైంది. టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా ఇది ఐదో అత్యల్ప స్కోర్. 1955లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ చేసిన 26 రన్స్ ఇప్పటిదాకా అత్యల్పం. భారత్ అత్యల్ప స్కోర్‌లలో ఇది ఐదోవది. అంతకుముందు ఇంగ్లండ్‌తో 42,ఆస్ట్రేలియాతో 58, ఇంగ్లండ్‌తో 58, సౌతాఫ్రికాతో 66 పరుగులు చేసింది.

India vs Australia: అతి జాగ్రత్తే కోహ్లీసేన కొంపముంచిందా? ఘోర పరాజయానికి కారణాలు ఇవేనా?

Story first published: Sunday, December 20, 2020, 12:35 [IST]
Other articles published on Dec 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+