న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar:బౌలింగ్ చేయనప్పుడు హార్దిక్ పాండ్యా ఎందుకు? న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ఆ ఇద్దర్నీ పక్కనపెట్టాలి!

Sunil Gavaskar Picks India Playing 11 For New Zealand Match: Ishan Kishan In And Hardik Pandya Out

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన భారత జట్టు.. మరో రసవత్తరపోరుకు సిద్దమవుతోంది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. రెండు జట్లు అనూహ్యంగా పాక్ చేతిలో ఓటమిపాలయ్యాయి. దాంతో విజయమే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. అయితే ఫస్ట్ మ్యాచ్ ఘోర పరాభావం తర్వాత టీమిండియాలో మార్పులు జరగాల్సిందేనని అటు అభిమానులు.. ఇటు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతూ అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ చేయలేకపోతున్న హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫామ్‌లో లేని భువనేశ్వర్ కుమార్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేయాలంటున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

బౌలింగ్ చేయనప్పుడు హార్దిక్ ఎందుకు?

బౌలింగ్ చేయనప్పుడు హార్దిక్ ఎందుకు?

స్పోర్ట్స్ తక్ చానెల్‌తో మాట్లాడిన గవాస్కర్.. బౌలింగ్ చేయనప్పుడు హార్దిక్ పాండ్యాను తీసుకోవడం అనవరమన్నాడు. అతని స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఆడించడం ఉత్తమమని, అలాగే భువనేశ్వర్ ప్లేస్‌లో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలన్నాడు. 'పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భుజ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇషాన్ కిషన్‌ను ఆడించాలి.

అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి పాండ్యా స్థానంలో ఇషాన్‌ పేరును సూచిస్తున్నా. భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్‌ను ఆడించే విషయంపై కూడా ఆలోచన చేయాలి. అయితే జట్టులో చాలా మార్పులు చేస్తే.. ప్రత్యర్థిని చూసి భయపడుతున్నామనే తప్పుడు సంకేతం వెళ్తుందని.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

 నెట్స్‌లో పాండ్యా బౌలింగ్..

నెట్స్‌లో పాండ్యా బౌలింగ్..

అయితే నేటి(గురువారం) టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం అతను సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే హార్దిక్ బౌలింగ్ వేసే అంశంపై టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. నాకౌట్ స్టేజీలో బౌలింగ్ చేస్తానని చెప్పాడు.

కానీ ఇప్పుడు టీమ్ క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బౌలింగ్ చేయాలని పాండ్యా డిసైడ్ అయిన ట్లు తెలుస్తోంది. ఒకవేళ పాండ్యా బౌలింగ్ చేయకపోతే.. అతని ప్లేసల్‌లో ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని, అప్పుడు అతన్ని ఫినిషర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా వాడుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

శార్దూల్ ఠాకూర్ బెస్ట్..

శార్దూల్ ఠాకూర్ బెస్ట్..

ఫస్ట్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్‌ను సైతం పక్కనపెట్టాలని, అతని స్థానంలో శార్దూల్‌ను తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్.. చివర్లో జట్టుకు కావాల్సిన పరుగులు చేయగలడని విశ్లేషకులు అంటున్నారు. అయితే స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు.

దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగడం ఖాయమేనని అభిమానులు భావిస్తున్నారు. పైగా మెంటార్‌గా ధోనీ ఉండటంతో తుది జట్టులో శార్దూల్‌ చోటు ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అయితే టీమ్‌మేనేజ్‌మెంట్ ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే.

Story first published: Thursday, October 28, 2021, 17:50 [IST]
Other articles published on Oct 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X