For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ విజయం.. చనిపోయిన మా అక్కకు అంకితం: ఇషాన్ కిషన్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయాన్ని చనిపోయిన తన అక్కకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విజయం దక్కడం, తన అక్కకు గొప్ప బహుమతిగా అందివ్వడం తనకు ప్రత్యేకమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.

ఈ గెలుపుతో మూడో టీ20 ప్రపంచకప్‌ను అందుకోవడంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకుంది. అంతేకాకుండా సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో ఇషన్ కిషన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సంజూ శాంసన్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కన్నీటి పర్యంతమైన ఇషాన్ కిషన్..

ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ఇషాన్ కిషన్.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఫైనల్‌కు రెండు రోజుల ముందే తన కజిన్ సిస్టర్ కారు ప్రమాదంలో మృతి చెందిందని, దాంతోనే తన కుటుంబ సభ్యులు ఎవరూ ఫైనల్ మ్యాచ్‌కు హాజరవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విజయాన్ని చనిపోయిన తన అక్కకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.

' ఫైనల్ మ్యాచ్‌కు ముందు మా కజిన్ సిస్టర్ కారు ప్రమాదంలో మరణించింది. ఆమె కోసమే నేను బాగా ఆడాను. ఈ విజయాన్ని ఆమెకు అంకితం చేస్తున్నాను. ఆమె ఇక మా మధ్య లేదని నమ్మడం కష్టంగా ఉంది. ఫైనల్‌కు ముందే ఆమెను కోల్పోవడం నన్ను మానసికంగా చాలా కృంగదీసింది. కానీ ఆమె కోసం ఈ కప్ గెలవాలనే పట్టుదల నన్ను ముందుకు నడిపించింది. ఈ రోజు ఆమె ఎక్కడున్నా నా విజయాన్ని చూసి గర్విస్తుందని నమ్ముతున్నాను.

Ishan Kishan Dedicates T20 World Cup Triumph to Late Cousin on International Women s Day
Photo Credit: screen grab for JioHotstar

హార్దిక్ భాయ్ సలహాతోనే..

నా సోదరి చనిపోయిందనే వార్తను తట్టుకోలేకపోయాను. హార్దిక్ భాయ్‌తో ఈ బాధను పంచుకున్నాను. జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. ఈ విజయాన్ని నేను ఆమెకు అంకితం చేస్తున్నాను. ఈ రోజు 'మహిళా దినోత్సవం' కావడంతో, ఇది నాకు ఇంకా ప్రత్యేకం. ఈ విషాదాన్ని తట్టుకొని ఆటపై దృష్టి పెట్టడం నాకు కష్టంగా అనిపించింది. ఈ కష్టకాలంలో నా కుటుంబంతో పాటు జట్టు అండగా నిలిచింది. నా సహచర ఆటగాళ్లంతా ఓ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు.

గత రెండేళ్లుగా నా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. జట్టులోకి రావడం, మళ్ళీ దూరం కావడం వంటి పరిస్థితుల తర్వాత, ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం నాపై నాకు ఉన్న నమ్మకాన్ని పెంచింది.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

ఇషాన్ అక్క, బావా మృతి..

ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్, ఆమె భర్త శుక్రవారం(మార్చి 6) ఒక ఘోర కారు ప్రమాదంలో మరణించారు. వారు ఒక పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దంపతులకు 6 నెలలు, 3 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఆ పిల్లలు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటనతో ఫైనల్ మ్యాచ్‌కు రావాల్సిన ఇషాన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోయారు. ఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తయిన అనంతరం ఇషాన్ కిషన్ బ్యాట్‌ను ఆకాశం వైపు చూపిస్తూ తన సోదరికి నివాళులర్పించాడు.

Story first published: Monday, March 9, 2026, 9:50 [IST]
Other articles published on Mar 9, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+