For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందాల జాతర.. బాత్రూమ్ సెల్ఫీలతో సెగలు రేపుతున్న స్టార్ క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్!

టీమిండియా యువ సెన్సేషన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన ఆటతో ఎంత సందడి చేస్తాడో మనందరికీ తెలిసిందే. అయితే ఇషాన్ కిషన్ పర్సనల్ లైఫ్‌పై కూడా అభిమానులకు అంతే ఆసక్తి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యం ఇషాన్ కిషన్ ప్రియురాలు, ప్రముఖ మోడల్ అదిత్ హుండియా సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అదితి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. "అన్‌స్క్రిప్టెడ్ మూమెంట్స్" అనే క్యాప్షన్ ఇచ్చి పంచుకున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

బాత్రూమ్ సెల్ఫీ నుంచి బెడ్‌రూమ్ వరకు..
అదితి హుండియా షేర్ చేసిన ఈ ఫోటోలలో ఆమె ఎంతో రిలాక్స్‌డ్ మూడ్‌లో కనిపిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడూ మేకప్‌తో మెరిసే అదితి.. ఈ ఫోటోలలో మాత్రం చాలా నేచురల్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాత్రూమ్ అద్దం ముందు నిలబడి తీసుకున్న స్టైలిష్ సెల్ఫీల నుంచి బెడ్‌రూమ్‌లో తీరిక సమయాన్ని గడుపుతున్న ఫోటోల వరకు ఆమె ప్రతి అడుగులోనూ తనదైన గ్లామర్‌ను ఒలకబోసింది. ఎటువంటి ఫిల్టర్లు లేకుండా, తన అసలైన అందాన్ని అభిమానుల ముందుంచిన ఆమె ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Aditi Hundia Glamorous Photos Ishan Kishan Girlfriend Sets Social Media on Fire Full Details

వరల్డ్ కప్ ట్రోఫీతో అదిరిపోయే పోజ్
ఈ ఫోటోలన్నింటిలోనూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. అదితి ప్రపంచ కప్ ట్రోఫీతో కలిసి ఉన్న ఫోటో. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుత విజయం సాధించిన తర్వాత.. ఇషాన్ కిషన్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్టేడియంలో ఇషాన్ కిషన్‌తో కలిసి అదితి హుండియా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఆ ట్రోఫీని గర్వంగా పట్టుకున్న ఫోటోను ఆమె మళ్లీ పోస్ట్ చేయడంతో అభిమానులు "రాబోయే మా వదినమ్మ అదిరిపోయింది" అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇషాన్ కిషన్ ఈ ఫోటోలపై ఇంకా స్పందించకపోయినా.. ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఎవరీ అదితి హుండియా?
రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయిన అదితి హుండియా.. కేవలం క్రికెటర్ ప్రియురాలిగానే కాకుండా గ్లామర్ రంగంలో తనకంటూ ఓ సొంత ముద్ద వేసుకున్నారు. ఆమె ఓ సక్సెస్‌ఫుల్ మోడల్, మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా కూడా నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అదితికి దాదాపు 5.50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ కిషన్, అదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ 'పవర్ కపుల్' తమ వివాహం గురించి ఎప్పుడు ప్రకటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Friday, March 13, 2026, 18:31 [IST]
Other articles published on Mar 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+