న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా లాన్స్ క్లూసెనర్

 South Africa name Lance Klusener as assistant batting coach for T20 against India

హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టు అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఆడబోయే మూడు టీ20ల సిరిస్‌కు లాన్స్ క్లూసెనర్ అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌‌గా వ్యవహారిస్తారు.

ఇదే పర్యటనలో బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ విన్సెంట్ బర్న్స్‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా ఎంపిక చేసింది. ఇక, ఫీల్డింగ్ కోచ్‌గా జస్టిన్ ఒంటాంగ్‌కే తిరిగి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ విషయమై క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక డైరెక్టర్ కొర్రీ వెన్ జైల్ మాట్లాడుతూ "సరికొత్త టీమ్‌ను నిర్మించే క్రమంలో టీమ్ డైరెక్టర్ కొత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను నియమించాం" అని అన్నారు.

<strong>ద్రవిడ్ సర్ ఇచ్చిన సూచనలే పాటిస్తున్నా.. అదే నా విజయ రహస్యం!!</strong>ద్రవిడ్ సర్ ఇచ్చిన సూచనలే పాటిస్తున్నా.. అదే నా విజయ రహస్యం!!

టీ20 సిరిస్‌కు మాత్రమే

టీ20 సిరిస్‌కు మాత్రమే

"దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించాం. అతడు కేవలం టీ20 సిరిస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మూడు ఫార్మాట్లకు కాదు" అని ఆయన తెలిపారు. తన తరంలో లాన్స్ క్లూసెనర్ అత్యుత్తమ ఆల్ రౌండర్‌. టెస్టుల్లో 80 వికెట్లు తీయడంతో పాటు 1906 పరుగులు చేశాడు. వన్డేల్లో 192 వికెట్లతో పాటు 3576 పరుగులు చేశాడు. జింబాబ్వే జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికకాక ముందు లాన్స్ క్లూసెనర్ హాలివుడ్‌బెట్స్ డాల్ఫిన్స్ జట్టుకు 2012 నుంచి 2016 వరకు కోచ్‌గా వ్వవహారించారు.

ఫీల్డింగ్ కోచ్ షార్ట్‌లిస్ట్‌ జాబితాలో జాంటీ రోడ్స్ పేరు లేకపోవడంపై ఎమ్మెస్కే వివరణ

యూరో టీ20 స్లామ్ టోర్నీలో

యూరో టీ20 స్లామ్ టోర్నీలో

యూరో టీ20 స్లామ్ టోర్నీలో గ్లాస్కో జెయింట్స్ జట్టుకు ఈ ఏడాది జులైలో హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇక, బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన విన్సెంట్ బర్న్స్‌ 2003 నుంచి 2011 వరకు బౌలింగ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియా-ఏతో నాలుగు రోజులు వార్మప్ మ్యాచ్‌ ఆడనుంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3 టీ20లు, 3 టెస్టుల్లో తలపడనుంది.

షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసిన బీసీసీఐ

షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసిన బీసీసీఐ

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగనున్న రెండో టెస్టుకు రాంచీ అతిథ్యమిస్తుండగా... అక్టోబర్ 19 నుంచి 23 వరకు జరిగే మూడో టెస్టుకు పూణె ఆతిథ్యమివ్వనుంది. అయితే రెండు, మూడు టెస్టు మ్యాచ్‌లు జరగాల్సిన వేదికలను ఇప్పుడు బోర్డు మార్చేసింది. ఈ మార్పుకు సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ కూడా అంగీకరించింది.

ఒలింపిక్స్‌కు ముందు వాడా ఎంత పనిచేసింది! ఎన్‌డీటీఎల్‌ అధికారిక గుర్తింపు రద్దు

తొలి టెస్టు విశాఖపట్నం వేదికగా

తొలి టెస్టు విశాఖపట్నం వేదికగా

రెండో టెస్టుకు రాంచీ అతిథ్యమిస్తోన్న సమయంలోనే దూర్గా పూజ ఫెస్టివల్ రావడంతో జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టెస్టుని పుణెకు మార్పాలంటూ బోర్డును కోరింది. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కోరికను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఈ మార్పుకు అంగీకరించింది. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇక, మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనుంది.

భారత పర్యటనకు జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా బోర్డు:

భారత పర్యటనకు జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా బోర్డు:

టెస్టు జట్టు:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), థియునిస్ డి బ్రూయిన్, క్వింటన్ డి కాక్ (wk), డీన్ ఎల్గార్, జుబైర్ హమ్జా, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్, సెనురాన్ ముతుసామి, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, వెర్నాన్ ఫిలాండర్, డేన్ పీడ్ట్, కగిసో రబాడా, రూడీ సెకండ్.

టీ20 జట్టు:

క్వింటన్ డి కాక్ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (వైస్ కెప్టెన్), టెంబా బావుమా, జూనియర్ దాలా, జోర్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, అన్రిచ్ నార్ట్జే, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రాబాడా, తబ్రా జోన్-జోన్ స్మట్స్.

Story first published: Friday, August 23, 2019, 15:22 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X