ఫీల్డింగ్ కోచ్ షార్ట్‌లిస్ట్ జాబితాలో జాంటీ రోడ్స్ పేరు లేకపోవడంపై ఎమ్మెస్కే వివరణ

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ను టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఎంపిక తుది జాబితాలోకి పరిగణనలోకి తీసుకోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. టీమిండియా సహాయక సిబ్బంది కోసం నిర్వహించిన ఇంటర్య్వూలు గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపిక చేయగా... బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్‌కే బీసీసీఐ పట్టం కట్టింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్ కమిటీ మొగ్గుచూపింది.

జాంటీ రోడ్స్‌ను కనీసం తుది జాబితాలో
జాంటీ రోడ్స్‌ను కనీసం తుది జాబితాలో చేర్చకపోవడంపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఎమ్మెస్కే మాట్లాడుతూ "ఫీల్డింగ్ కోచ్ తుది జాబితాలో శ్రీధర్‌తో పాటు, అభయ్ శర్మ, టి దిలీప్‌లను ఎంపిక చేశాం. వీరిద్దరికీ భారత్-ఏ జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఎన్‌సీఏలో కూడా సేవలందించారు. దాంతో రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు" అని అన్నాడు.
స్టెయిన్ మాదిరి బౌలింగ్: వరల్డ్ క్లాస్ బౌలర్ అంటూ ఆర్చర్‌కు వార్నర్ ప్రశంస
శ్రీధర్‌కే మళ్లీ ఫీల్డింగ్ కోచ్‌గా పట్టం
అంతేకాదు శ్రీధర్‌కే మళ్లీ ఫీల్డింగ్ కోచ్‌గా పట్టం కట్టడాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ సమర్ధించుకున్నాడు. "ఆర్. శ్రీధర్ అత్యుత్తమ ఫీల్డింగ్ కోచ్. అందులో సందేహం లేదు. టీమిండియా ఫీల్డింగ్ మెరుగు పడటంలో శ్రీధర్ పాత్ర చాలానే ఉంది. దాంతో మాకు వేరే ఆలోచన లేకుండా శ్రీధర్‌నే ఎంపిక చేశాం" అని తెలిపాడు.

రెండో స్థానంలో నిలిచిన బంగర్
గతవారం క్రికెట్ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాథోడ్, మూడో స్థానంలో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ మార్క్ రామ్‌ప్రకాశ్ నిలిచారు.
సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!

ధోనీని ఏడో స్థానంలో పంపడంపై
టీమిండియా నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ను తీర్చిదిద్దడంలో సంజయ్ బంగర్ విఫలమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఏడో స్థానంలో పంపడంపై అప్పట్లో బంగర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే అతడి పదవికి ఎసరు పెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications