న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒలింపిక్స్‌కు ముందు వాడా ఎంత పనిచేసింది! ఎన్‌డీటీఎల్‌ అధికారిక గుర్తింపు రద్దు

 WADA suspends Indias National Dope Testing Laboratory

హైదరాబాద్: టొక్యో ఒలింపిక్స్‌కు ముందు భారత్‌కు ఉహించని పరిణామమిది. నేషనల్ డోప్ టెస్టింగ్ లేబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఏడాదిలో టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌కి వెళ్లనున్న తరుణంలో వాడా తీసుకున్న నిర్ణయం కలవరపాటుకి గురి చేస్తోంది.

నేషనల్ డోప్ టెస్టింగ్ లేబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని రద్దు చేసినప్పటికీ నాడా డోప్‌ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సేకరించిన ఆటగాళ్ల నమూనాలను(బ్లడ్, యారిన్) ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోవచ్చని వాడా స్పష్టం చేసింది.

సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!

ఎన్‌డీటీఎల్‌ను రద్దు చేయడానికి గల కారణాలను సైతం వాడా వెల్లడించింది. ఎన్‌డీటీఎల్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే గుర్తింపు రద్దునకు కారణమని వాడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే ఎన్‌డీటీఎల్‌లో లేబరోటరీ ఎక్సపర్ట్ గ్రూప్(ల్యాబ్ఈజీ) చేపట్టిన తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు.

వాడా తన వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు వాడా లేబొరేటరీ నిపుణుల బృందం మేలో తినిఖీలు ప్రారంభించిందని, ఆ తర్వాత ఓ స్వతంత్ర క్రమశిక్షణా కమిటీ కూడా దర్యాప్తు చేసిందని అందులో పేర్కొంది. ఆ నివేదికల ఆధారంగా వాడా ఎక్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి అయిందని పేర్కొంది.

ఎన్‌డీటీఎల్‌పై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా వాడా స్పష్టం చేసింది. ఈ నిషేధిత సమయంలో ఇప్పటివరకు ఎన్‌డీటీఎల్‌ ల్యాబ్‌లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపించాల్సిందిగా వాడా సూచించింది. నిబంధనల ప్రకారం వాడా నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డీటీఎల్‌ 21 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(సీఏఎస్‌)ని ఆశ్రయించే వెసులుబాటు ఉంది.

దీంతో పాటు వాడా చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎన్‌డీటీఎల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేస్తే, నిషేధ కాలం పూర్తయ్యే లోపు మరోసారి గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవచ్చని వాడా సూచించింది. తాజాగా ఎన్‌డీటీఎల్‌పై వాడా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నాడా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని స్పోర్ట్స్‌ లాయర్‌ పార్థ గోస్వామి అన్నారు.

ఆసియాలో భారత్‌లో కాకుండా వాడా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ల్యాబ్‌లు థాయిలాండ్, దక్షిణ కొరియా, జపాన్, ఖతార్, చైనాలలో ఉన్నాయి. దీంతో భారత క్రీడాకారుల నమూనాలను పరీక్షించాలనుకుంటే వాటిని ఇప్పుడు ఆయా దేశాల్లోని ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నది.

తొలి టెస్టు: విండీస్ పేసర్ల విజృంభణ.. ఆదుకున్న రహానే

టోక్యో ఒలింపిక్స్‌కి ఇంకా ఏడాది మాత్రమే ఉన్న సమయంలో ఇక్కడ బడ్జెట్‌ ఎంతో కీలకమని పార్థ గోస్వామి పేర్కొన్నారు. ఇటీవలే టీమిండియా క్రికెటర్లు సైతం నాడా కిందకు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ కూడా కష్టకాలాన్ని ఎదుర్కొనుంది. భారత్‌లో గుర్తింపు పొందిన ఏకైక ల్యాబ్‌ ఎన్‌డీటీఎల్‌ కావడంతో బీసీసీఐ క్రికెటర్ల నమూనాలను ఇక్కడికే పంపించేది.

తాజాగా వాడా తీసుకున్న నిర్ణయం భారత్‌లోని అన్ని క్రీడలపై ప్రభావం చూపనుంది. దీంతో వాడా తీసుకున్న నిర్ణయంపై కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(సీఏఎస్‌)ని ఆశ్రయించాలని ప్రముఖ స్పోర్ట్స్‌ లాయర్‌ పార్థ గోస్వామి అన్నారు.

Story first published: Friday, August 23, 2019, 12:33 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X