న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మ్యాచ్‌లో సచిన్ 98 రన్స్‌కు ఔటవ్వడం బాధించింది: అక్తర్

Shoaib Akhtar Says Wanted Sachin Tendulkar to Score Hundred in 2003 World Cup

కరాచీ: చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇక ప్రపంచకప్ వేదికగా జరిగే మ్యాచ్‌లంటే ఆ మజానే వేరు. 2003 వరల్డ్‌కప్‌లో దాయదీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పటీకే ప్రత్యేకమే. ఆ మ్యాచ్‌లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 98 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు వియంలో కీలక పాత్ర పోషించాడు. కానీ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మ్యాచ్ గెలిచినా సచిన్ శతకం పూర్తి చేసుకుంటే బాగుండనే భావన అందరిలోను కలిగింది.

అయితే మాస్టర్ సెంచరీ చేజార్చుకోవడం తనకు కూడా చాలా బాధేసిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. సచిన్ సెంచరీ చేయాలని తాను కోరుకున్నట్లు తాజాగా వెల్లడించాడు. అయితే నాటి మ్యాచ్‌లో 98 పరుగుల వద్ద మాస్టర్‌ను ఔట్ చేసిందే అక్తర్ కావడం గమనార్హం. తన మనసులోని మాటను నిక్కచ్చిగా చెప్పే రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. ఆదివారం హలో యాప్‌ లైవ్‌సెషన్‌లో ఫ్యాన్స్‌తో చిట్
చిట్‌చాట్ చేశాడు.

సచిన్ సెంచరీ చేయాల్సింది..

సచిన్ సెంచరీ చేయాల్సింది..

ఈ సందర్భంగా 2003 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. సచిన్ చిరస్మరణీయ మ్యాచ్‌ను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.‘సచిన్ 98 పరుగులకు ఔటవ్వడం చాలా బాధేసింది. అది చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్. అతను సెంచరీ చేయాల్సింది. నేను కూడా సచిన్ శతకం సాధించాలని కోరుకున్నా. నేను వేసిన బౌన్సర్ అంతకు ముందు అతను కొట్టిన సిక్సర్‌లా వెళ్తుందనుకున్నా.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ మ్యాచ్‌లో 75 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో సచిన్ 98 పరుగులు చేసి.. అక్తర్ భయంకరమైన బౌన్సర్‌కు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో అక్తర్ 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకొని ఒకే ఒక వికెట్ తీశాడు. అది కూడా సచిన్‌దే.

 భారత్ అద్భుత విజయం..

భారత్ అద్భుత విజయం..

నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సయీద్ అన్వర్ (126 బంతుల్లో 101) అద్భుత సెంచరీతో 40 ఓవర్లకు వరకు ఆడాడు. కానీ అతనికి అండగా మరే బ్యాట్స్‌మన్ 40కి పైగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో ఆ జట్టు 272 పరుగులకే పరిమితమైంది. కానీ అప్పట్లో అది భారీ లక్ష్యమే. పైగా భీకర బౌలింగ్ కలిగిన పాక్‌పై అంతటి స్కోర్ ఛేజ్ చేయడం సవాల్‌తో కూడినది. కానీ సచిన్ సూపర్ ఇన్నింగ్స్‌కు అండగా యువరాజ్(50 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (44 నాటౌట్) రాణించడంతో నాలుగు ఓవర్లు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది.

 కోహ్లీ- సచిన్‌కు పోలికా..?

కోహ్లీ- సచిన్‌కు పోలికా..?

ఇక కోహ్లీ, సచిన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఓ అభిమాని అక్తర్ ప్రశ్నించగా.. కఠినమైన శకంలో సచిన్ క్రికెట్ ఆడడాని ప్రస్తుత తరంలో అయితే అతను సులువుగా మరో 1.30 లక్షల పరుగులు చేసేవాడని అక్తర్ సమాధానమిచ్చాడు. ‘క్రికెట్‌లోనే అత్యంత కఠినమైన శకంలో మాస్టర్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి పరిస్థితుల్లో ఆడితే కనుక అతను సులువుగా మరో 1.30 లక్షల పరుగులు చేసేవాడు. కాబట్టి సచిన్-కోహ్లీ మధ్య పోలిక తేవడం సరైంది కాదు.'అని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తెలిపాడు.

పిల్ల లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది..

పిల్ల లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది..

ఇక కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని వినిపిస్తున్న ప్రతిపాదనపై అక్తర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఖాళీ మైదానల్లో మ్యాచ్‌లు జరిపితే పిల్ల లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుందన్నాడు.‘ఖాళీ స్టేడియాల్లో ఆడటం క్రికెట్ బోర్డులకు లాభం చేకూర్చ వచ్చు. కానీ ఈ పద్దతిలో ప్రేక్షకుల ఆదరణను ఆశించిన స్థాయిలో అందుకోలేం. ప్రేక్షకుల్లేకుండా క్రికెట్ ఆడటం వధువు లేని వివాహం లాంటిది. ఆటలు ఆడటానికి ప్రేక్షకులు అవసరం. మరో ఏడాది లోపు కరోనా అంతమై పరిస్థితులు చక్కబడుతాయనుకుంటున్నా'అని అక్తర్ పేర్కొన్నాడు.

ప్రధాని మోదీపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు.. బిచ్చగాళ్లంటూ తిప్పికొట్టిన గంభీర్!

Story first published: Monday, May 18, 2020, 14:19 [IST]
Other articles published on May 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X