న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రధాని మోదీపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు.. బిచ్చగాళ్లంటూ తిప్పికొట్టిన గంభీర్!

Gautam Gambhir slams Shahid Afridi over spewing venom against India and PM Modi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్, బీజీపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డాడు. కశ్మీర్ కోసం గత 70 ఏళ్లుగా పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటుందని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చాలా సార్లు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన అఫ్రిది

కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరకులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన ఈ పాక్ మాజీ కెప్టెన్ అక్కడి స్థానికులతో మాట్లాడూతు భారత్‌పై తనకున్న విద్వేషాన్ని చాటుకున్నాడు. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో అఫ్రిది ఏం మాట్లాడాడంటే.. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

మోదీ మనసులో కరోనాను మించిన వ్యాధి..

‘పాకిస్థాన్‌‌ సైనిక బలం 7 లక్షలు కాగా.. అంతమంది భారత సైనికులను మోదీ కేవలం కశ్మీర్‌లోనే మోహరించారు. మీ అందమైన గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నా. చాలా కాలం నుంచి మీ అందరిని కలవాలనుకుంటున్నా. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుంది. కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉంది'అని వ్యాఖ్యానించాడు. భారత్‌కు కశ్మీర్‌లు కూడా పాక్ ఆర్మీకే మద్దతు ఇస్తున్నారనీ తెలిపాడు. ఆఫ్రిది డైలాగ్‌లకు పాక్ సైనికులు చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అఫ్రిది, ఇమ్రా, బాజ్వా జోకర్..

అఫ్రిది, ఇమ్రా, బాజ్వా జోకర్..

అఫ్రిది అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూసి ఆగ్రహానికి గురైన గంభీర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ వ్యాఖ్యానించాడు.

‘పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?'అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.

ఆ విజయంతోనే బంగ్లా ఏర్పాటు..

ఆ విజయంతోనే బంగ్లా ఏర్పాటు..

1971లో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తూర్పు పాకిస్థాన్‌‌‌పై విజయం సాధించి బంగ్లాదేశ్‌‌ను ఏర్పాటు చేసింది. నాటి యుద్ధంలో లక్షమంది పాక్ సైనికులకు భారత్ క్షమాభిక్ష ప్రసాదించింది. లొంగిపోయిన లక్షమంది పాక్ సైనికులను క్షమించి వదిలిపెట్టింది. బంగ్లాదేశ్ ఏర్పాటును పాక్ అత్యంత అవమానకర పరాజయంగా భావిస్తూ ఉంటుంది. సరిగ్గా దీన్నే గంభీర్ తన ట్వీట్ ద్వారా ఆఫ్రిదీకి గుర్తు చేశాడు.

సచిన్ డబుల్ సెంచరీపై స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు!

Story first published: Sunday, May 17, 2020, 16:43 [IST]
Other articles published on May 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X