ఈ బయో బబుల్ ‘బిగ్‌ బాస్’లానే ఉంది: శిఖర్ ధావన్

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ మరో మూడు రోజుల్లో షురూ కానుంది. కరోనా దెబ్బతో భారత్‌ను విడిచి యూఏఈకి తరలిన ఈ క్యాష్ రిచ్ లీగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరగనుంది. ఇప్పటికే జట్లన్నీ బయో బబుల్ వాతావరణంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈ బయో బబుల్‌ టీవీ రియాల్టీషో 'బిగ్ బాస్'లానే ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఈ వాతావరణం ఆటగాళ్ల మానసిక బలానికి పరీక్షగా నిలుస్తుందని తాజాగా హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇది బిగాబాస్ హౌసే ..

ఇది బిగాబాస్ హౌసే ..

‘ఈ బయో బబుల్ వాతావరణం మా మనసిక బలానికి పరీక్షగా ఉంది. దాదాపు రియాల్టీ షో బిగ్‌బాస్‌లానే ఉంది. మొత్తానికి నాకైతే ఈ ఫీలింగ్ బాగుంది. అయితే ఇది ప్రతీ ఒక్కరికి సవాలు అనడం కంటే.. ప్రతీ అంశంలో మెరుగవ్వడానికి వచ్చిన సదావకాశమని నేను భావిస్తా. నేనైతే సానుకూల ధృక్పథంతో సంతోషంగా ఉంటున్నా. ఈ పరిస్థితులను ఎలా స్వీకరిస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సానుకూలంగా తీసుకుంటే ఈ బయోబబుల్‌ వాతవారణాన్ని ఆస్వాదించవచ్చు. లేకుంటే బాధితుడిగా మారి ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.

సానుకూలంగా లేకుంటే..

సానుకూలంగా లేకుంటే..

చుట్టూ పది మంది పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తులున్నా.. నీ ఆలోచనలు సానుకూలంగా లేకుంటే ఏవరూ ఏం చేయలేరు. మాకు ఎలాంటి ఔట్ లెట్ లేవు. రెస్టారెంట్‌‌లకు వెళ్లి ఆస్వాదించడం, బయటి వ్యక్తులను చూడటం వంటివి అసలే లేవు. కాబట్టి వీటిని ఆటగాళ్లు ఎలా స్వీకరిస్తారనేదే అసలు ప్రశ్న. ఈ ఐపీఎల్ ఆటగాళ్లందరికి చాలా ముఖ్యం. ఒకవేళ అనుకున్న రీతిలో రాణించకపోతే దాన్నెలా స్వీకరిస్తారు? కొంతమందితో హోటల్లోనే బందీ అయ్యారు. కాబట్టి ఈ ఐపీఎల్ సీజన్ ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

యోగా, మెడిటేషన్‌తో

యోగా, మెడిటేషన్‌తో

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యోగా, మెడిటేషన్ చేస్తూ శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటున్నానని ఈ టీమిండియా ఓపెనర్ చెప్పుకొచ్చాడు. యోగా, మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతతతో పాటు తన బ్యాటింగ్ సామర్థ్యం మెరుగైందన్నాడు. ‘నా స్టామినా, ఏకాగ్రత, శక్తి సామర్థ్యం బాగున్నాయి. నా బాడీ చాలా స్టిఫ్‌గా ఉంది. నా సామర్థ్యం మరోస్థాయికి చేరింది. మీరు గుర్తించలేనంతగా నా నైపుణ్యాలు, వైఖరిలో మార్పు వచ్చింది. అవి ఏంటనేవి మాత్రం నేను చెప్పను'అని ధావన్ పేర్కొన్నాడు.

పాంటింగ్ ఒక్కటే చెప్పాడు..

పాంటింగ్ ఒక్కటే చెప్పాడు..

వరల్డ్ క్లాస్ కోచ్ అయిన రికీ పాంటింగ్‌తో పనిచేయడం ఆస్వాదిస్తున్నానని గబ్బర్ పేర్కొన్నాడు. ‘పాంటింగ్ ఓ గొప్ప కోచ్. అతని పర్యవేక్షణలో ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. అతను నాకు ఒక్కటే చెప్పాడు. నా బాడీ లాంగ్వెజ్‌ను బలంగా ఉంచుకోమన్నాడు. అతని సాయంతో దానిపై కసరత్తులు చేస్తున్నా. ఇక సహచర ఆటగాళ్లకు నేను చెప్పది ఒక్కటే.. సరైన విధానాన్ని అనుసరించండి. తరుచూ మన సక్సెస్ మంత్రాన్ని మనం రిపీట్ చేయాలి. ఒక్కసారి చేస్తే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. ఒక మ్యాచ్‌లో ఓడామని నిరాశ చెందకూడదు. విజయం కోసం గట్టిగా శ్రమించాలి'అని ధావన్ తెలిపాడు.

Delhi Capitals టైటిల్ గెలిచెనా .. జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 16, 2020, 13:25 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X