Delhi Capitals టైటిల్ గెలిచెనా .. జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!!

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. పేరు మార్చుకొని బరిలోకి దిగినా ఆ జట్టుకు కలిసి రాలేదు. చాలా సార్లు భారీ అంచనాలతో బరిలోకి దిగినా.. ఏనాడూ వాటిని అందుకోలేదు. గత సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ వరకు వెళ్లినా.. క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. అయితే ఈ సారి లెక్క మారేలా ఉంది. కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ కొత్తగా, చాలా బలంగా కనిపిస్తున్నది. గత సీజన్లతో పోలిస్తే ఓ అడుగు ముందే ఉంటుందని అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకుంటుందా? లేక గత చరిత్రనే రిపీట్ చేస్తుందా..? ఒక సారి జట్టు బలాబలహీనతలపై లుక్కెద్దాం.

బలం-బలగం..

బలం-బలగం..

ఇతర జట్ల మాదిరిగానే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోనూ బలమైన పవర్ హిట్టర్లు ఉన్నారు. పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లాంటి భారత ఆటగాళ్లకు తోడు మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారి, హెట్‌మైర్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. హెట్‌మైర్ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసిరానుంది. వీళ్లు కాకుండా జాసన్ రాయ్, క్రిస్ వోక్స్‌తో ఢిల్లీ బ్యాటింగ్ డెప్త్ చాలా ఎక్కువగా ఉంది.

వీరంతా స్థాయికి తగ్గట్టు ఆడితే ఢిల్లీ సులువుగా 200కిపైగా స్కోర్లు సాధిస్తుంది. బౌలింగ్ విషయంలోనూ ఢిల్లీ అంతే బలంగా కనిపిస్తుంది. ఇషాంత్ శర్మ, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్ వంటి పేసర్లకు తోడుగా అశ్విన్, అమిత్ మిశ్రా లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లున్నారు. అశ్విన్ ఆల్‌రౌండర్‌గా కూడా ఉపయోగపడనున్నాడు. మిశ్రాకు ఐపీఎల్‌లో అదిరిపోయే రికార్డుంది. అక్షర్ పటేల్, సందీప్ లమిచానే వీరికి అదనం. ఇటీవల ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో సందీప్ అదరగొట్టాడు.

బలహీనత

బలహీనత

ఢిల్లీకి కొద్దోగొప్పో ఏదైనా సమస్య ఉందంటే అది పేస్ విభాగంలోనే. క్రిస్ వోక్స్ ఆడడంపై అనుమానాలు ఉండడంతో ఇషాంత్, నోర్జ్, రబడాపైనే భారమంతా పడనుంది. మోహిత్ శర్మ, అవేశ్ ఖాన్ బ్యాకప్ పేసర్లుగా ఉన్నప్పటికీ ఎంత వరకు రాణిస్తారో చూడాలి. ఇక నిలకడలేమి ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అతని భవితవ్యం ఈ లీగ్‌తోనే ముడిపడి ఉంది. ఈ పరిస్తితుల్లో అతనెలా రాణిస్తాడో చూడాలి.

ప్లేఆఫ్స్ అంచనా

ప్లేఆఫ్స్ అంచనా

రికీ పాంటింగ్ అండ, యువ ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది కాబట్టి ఈ సారి టైటిల్ రేసులోకి రావొచ్చు. ప్లే ఆఫ్స్‌కు ఈజీగా చేరుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరడం పక్కా అని విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు 177 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 77 గెలిచి 98 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండింటిలో ఫలితం లేదు.

జట్టు

జట్టు

బ్యాట్స్‌మెన్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్యా రహానే. హెట్‌మైర్

ఆల్‌రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, డానియల్ సామ్స్, కీమో పాల్, లలిత్ యాదవ్

వికెట్ కీపర్లు: రిషభ్ పంత్, అలెక్స్ క్యారీ

బౌలర్లు: అమిత్ మిశ్రా, నోర్జ్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, మోహిత్ శర్మ, అశ్విన్, సందీప్ లిమిచానె, తుషార్ దేశ్ పాండే

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 15, 2020, 21:53 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X