న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శశాంక్ మనోహర్ ఇకపై ఐసీసీ మాజీ చైర్మన్.. కొత్త చైర్మన్‌ రేసులో దాదా!

Shashank Manohar step down as ICC Chairman


బాయ్:
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా వ్యవహరించిన 62 ఏళ్ల శశాంక్ మనోహర్ పదవీకాలం ముగిసింది. బుధవారం ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. నిబంధనల ప్రకారం ఇంకో రెండేళ్లు శశాంక్‌కు చైర్మన్‌గా కొనసాగే అవకాశమున్నా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖవాజ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తారని ఐసీసీ ప్రకటించింది.
 వారం రోజుల్లో నిర్ణయం..

వారం రోజుల్లో నిర్ణయం..

‘ఐసీసీ చైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం ముగిసింది. ఈరోజు బోర్డు సభ్యులంతా భేటీ అయ్యారు. డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం' అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త చైర్మన్ ఎన్నిక అంశంపై ఐసీసీ వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోనుంది.

రెండు సార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా..

రెండు సార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా..

మహారాష్ట్ర, నాగపూర్‌కు చెందిన న్యాయవాది మనోహర్‌ 2015 నవంబర్‌లో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన రెండు సార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2011 వరకు.. ఆ తర్వాత 2015 అక్టోబర్ నుంచి 2016 మే దాకా రెండోసారి బీసీసీఐ పదవిలో కొనసాగాడు.

కొత్త చైర్మన్‌ రేసులో గ్రేవ్స్‌, దాదా!

కొత్త చైర్మన్‌ రేసులో గ్రేవ్స్‌, దాదా!

ఐసీసీ నూతన చైర్మన్‌గా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌, బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ప్రధాన పోటీదారులుగా ఉండే అవకాశం ఉంది. ఇక వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌, న్యూజిలాండ్‌ నుంచి గ్రెగర్‌ బార్‌క్లే, దక్షిణాఫ్రికా తరఫున క్రిస్‌ నెన్‌జాని కూడా చైర్మన్‌ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా మూడోసారి ఓ వ్యక్తి చైర్మన్‌ పదవి చేపట్టవచ్చు. దీంతో ఇప్పటికే రెండు పర్యాయాలు పూర్తి చేసుకోవడంతో మరోసారి ఆ పదవికి పోటీపడేందుకు శశాంక్‌ మనోహర్‌కు కూడా అవకాశముంది. కానీ.. మరోసారి పదవి స్వీకరించేందుకు అతను ఆసక్తి చూపుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 బీసీసీఐ పరిస్థితేంటి..?

బీసీసీఐ పరిస్థితేంటి..?

మనోహర్‌తో కొన్ని విభేదాలున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అతని నిష్క్రమణ బీసీసీఐకి ఓ రకంగా అనుకూల పరిణామమే. ఎందుకంటే మనోహర్ భారత్‌కు చెందినవాడే అయినా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని గత కొన్ని రోజులుగా బీసీసీఐ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఐసీసీ ప్రపంచకప్ వాయిదా విషయాన్ని నాన్చడం మనోహర్ పనేనని బహిరంగంగానే ఆరోపించింది. మరోవైపు ఐసీసీతో బీసీసీఐకి రెండు మేజర్‌ టోర్నీల (భారత్‌ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 వరల్డ్‌ కప్‌, 2023 వన్డే వరల్డ్‌ కప్‌)కు సంబంధించి పన్ను మినహాయింపు వివాదం నడుస్తోంది. ఈ సమస్యలన్నీ తొలగి ఐసీసీలో మళ్లీ బీసీసీఐ చక్రం తిప్పాలంటే గంగూలీలాంటి వ్యక్తి ఆ పెద్ద పోస్టులోకి రావాలని భారత క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

1999 వరల్డ్‌కప్‌ సమయంలో నా భార్యను కప్‌బోర్డులో దాచా: పాక్ మాజీ క్రికెటర్

Story first published: Thursday, July 2, 2020, 10:25 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X