Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1999 వరల్డ్‌కప్‌ సమయంలో నా భార్యను కప్‌బోర్డులో దాచా: పాక్ మాజీ క్రికెటర్

Saqlain Mushtaq recalls how he had to hide his wife in cupboard during ICC World Cup 1999

కరాచీ: ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 1999 ప్రపంచకప్‌ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటనను పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బోర్డు ఆదేశాలను దిక్కరించి తాను చేసిన ఓ తుంటరి పనిని ఈ పాక్ దిగ్గజం గుర్తు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులను ఇంటికి పంపాలని టోర్నీ మధ్యలో బోర్డు ఆదేశించినా.. తాను మాత్రం తన భార్యను కప్‌బోర్డులో దాచి ఉంచిన విషయాన్ని బయటపెట్టాడు.

పెళ్లైన కొత్తలో..

పెళ్లైన కొత్తలో..

‘1998 డిసెంబర్‌లో నాకు పెళ్లైంది. ఆ సమయంలో నా భార్య లండన్‌లోనే ఉండేది. 1999 ప్రపంచకప్‌లో మొదట ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను కూడా అనుమతించారు. కానీ

టోర్నీ మొదలైన కొన్ని రోజుల తర్వాత మా కుటుంబ సభ్యులను వెనక్కి పంపాలని హఠాత్తుగా ఓ రోజు బోర్డు ఆదేశించింది. అప్ప‌టివ‌ర‌కు సంతోషంగా ఉన్నా ఆక‌స్మికంగా చోటుచేసుకున్న ఈ మార్పుల‌పై మా హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్‌తో మాట్లాడాను. కానీ ఫ‌లితం లేదు. వెంట‌నే కుటుంబ‌స‌భ్యుల‌ను వెన‌క్కి పంపాల్సిందే అన్నారు. అంతా స‌జావుగా జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎటువంటి కార‌ణం లేకుండా నా భార్య‌ను వెన‌క్కి పంపాల‌నుకోలేదు. దీంతో రూల్స్ బ్రేక్ చేసి త‌న‌ను ఇంటికి పంపించానని అబ‌ద్ధమాడాను.

కప్‌బోర్డ్‌లో దాచా..

కప్‌బోర్డ్‌లో దాచా..

మేనేజర్‌ చెక్‌ చేయడానికి వచ్చినప్పుడు నా భార్యను కప్‌బోర్డులో దాక్కోమని చెప్పాను. అయితే ఓ రోజు ఆట గురించి డిస్క‌స్ చేయ‌డానికి మహ్మద్ అజార్, యూసఫ్ నా గదికి వ‌చ్చారు. నా గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం వారికి కలిగింది. దీంతో నా సతీమణిని బయటకు రావాల్సింది కోరాను. వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు.

కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాక్‌ ఓటమి పాలైంది.

ఓటమితో అపార్ట్‌మెంట్‌కు పంపించా..

ఓటమితో అపార్ట్‌మెంట్‌కు పంపించా..

అప్పుడు కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆటగాళ్లందరూ డీలా పడిపోయారు. అప్పుడు ఎవరూ గమనించకుండా.. లండన్‌లోని నా అపార్ట్‌మెంట్‌లో ఉండమని చెప్పి నా భార్య బయటకు పంపాను. కౌంటీ క్రికెట్ ఆడుతుండటంతో వారు నాకు ఓ అపార్డ్ మెంట్ ఇచ్చారు.'అని సక్లయిన్‌ చెప్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు 49 టెస్టులు, 169 వన్డేలు ఆడిన స‌క్ల‌యిన్ ముస్తాక్ 208, 288 వికెట్లు పడగొట్టాడు.

 దారుణ ఓటమి..

దారుణ ఓటమి..

క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగిన నాటి ఫైనల్లో పాకిస్థాన్ దారుణాతి దారుణంగా ఓటమిపాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్..ఆసీస్ బౌలర్ల ధాటికి 39 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో 25 ఎక్స్‌ట్రాలే టాప్ స్కోర్ కాగా.. సగం మంది బ్యాట్స్‌మన్ రెండెంకల పరుగులు చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో షేన్ వార్న్(4/34), గ్లేన్ మెక్‌గ్రాత్(2/13) పాక్ పతనాన్ని శాసించారు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆసీస్.. 20.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులతో 179 బంతులు మిగిలుండగానే అలవోక విజయాన్నందుకొని విశ్వవిజేతగా నిలిచింది. ఆడమ్ గిల్ క్రిస్ట్(54), మార్క్ వా(37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

హార్దిక్ పాండ్యా ప్రేయసి నటాషా బికినీ ఫొటో వైరల్

Story first published: Thursday, July 2, 2020, 9:03 [IST]
Other articles published on Jul 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+