న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం అది: షేన్ వార్న్

Shane Warne slams Ricky Ponting’s call to bowl first in Edgbaston Test of Ashes 2005

సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. టెస్ట్‌ మ్యాచ్‌లు అంటేనే బోర్‌గా ఫీలయ్యే ఈ రోజుల్లో కూడా ఈ యాషెస్ సిరీస్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా ఆఖరి వరకు పోరాడటంతో ఈ సిరీస్ ఆద్యాంతం రసవత్తరంగా సాగుతుంది. దీనికి తోడు ఆటగాళ్ల స్లెడ్జింగ్ అభిమానులకు కావాల్సిన మజానిస్తుంది. ఇరుజట్ల మధ్య జరిగే యాషెస్ సంగ్రామంలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లున్నాయి. అందులో 2005 ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ఒకటి. ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు ఊరించిన విజయం ఇంగ్లండ్‌ను వరించింది. ఆ జట్టు అనూహ్యంగా 2 పరుగులతో విజయాన్నందుకుంది.

అదే పెద్ద తప్పు..

అదే పెద్ద తప్పు..

అయితే ఈ మ్యాచ్‌లో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే తమ కొంప ముంచిందని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వార్న్ తెలిపాడు. పాంటింగ్ కెప్టెన్సీలోనే ఇది అత్యంత చెత్త నిర్ణయమని విమర్శించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఆ వికెట్‌పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్.. ఎంచుకోవడమే అతను చేసిన పెద్దతప్పుగా చెప్పుకొచ్చాడు. ‘ఓ కెప్టెన్‌గా పంటర్ తీసుకున్న ఆ నిర్ణయం అత్యంత చెత్తది. అతని నిర్ణయం ఇంగ్లండ్‌కు మేలు చేసింది'అని వార్న్ ఫాక్స్ స్పోర్ట్స్ డాట్ కమ్‌తో తెలిపాడు.

ఇంగ్లండ్ ఆట సూపర్..

ఇంగ్లండ్ ఆట సూపర్..

ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. బ్రెట్‌లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ దాదాపు తమ విజయాన్ని ఖాయం చేసినా ఇంగ్లండ్ పట్టువదల్లేదని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తాను హిట్ వికెట్ అయిన తీరు ఇప్పటికీ అంతుపట్టడం లేదని చెప్పుకొచ్చాడు.

‘ఆ రాత్రి ముందు చివరి ఓవర్‌లో స్టీవ్ హర్మిసన్ స్లోయర్ బంతితో మైకెల్ క్లార్క్‌ను బౌల్ట్ చేశాడు. అప్పటికి ఆసీస్ విజయానికి 107 పరుగులు కావాలి. బ్రెట్ లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ ఉండటంతో మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకున్నా. కానీ ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. బంతి రివర్స్ స్వింగ్ అవుతుండటంతో 90 మైళ్ల వేగంతో బంతులు విసిరి ఫలితాన్ని రాబట్టారు.

హార్మీసన్, ఫ్లింటాఫ్ సూపర్బ్‌గా బౌలింగ్ చేశారు. నా బ్యాటింగ్ సమయంలో ముందుకొచ్చి ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ నా కాలు స్టంప్స్ తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగా. నేను అలా ఎలా ఔటయ్యాననే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదు. అలా హిట్ వికెట్ అవ్వడాన్ని ఇప్పటికీ మరిచిపోవడం లేదు.'అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు.

ఆద్యాంతం ఉత్కంఠం..

ఆద్యాంతం ఉత్కంఠం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 407 రన్స్ చేసింది. అనంతరం ఆసీస్ 308 పరుగులు చేసి 99 రన్స్ వెనుకబడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 182 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్ ముందు 282 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ టార్గెట్‌ చేజింగ్‌లో తడబడిన ఆసీస్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పుతూ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. బ్రెట్‌లీ(43 నాటౌట్)తో కలిసి షేన్ వార్న్(42) విజయం దిశగా నడిపించారు. కానీ వార్నర్ హిట్ వికెట్ అవ్వగా.. చివరి బ్యాట్స్‌మన్‌ను హర్మిసన్ ఔట్ చేశాడు. దీంతో రెండు పరుగుల దూరంలో ఆసీస్ ఓటమికి తలవంచింది.

ధోనీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసేవాడు.. ఓ సారి బ్యాట్‌నే విసిరేసాడు

Story first published: Tuesday, May 12, 2020, 14:53 [IST]
Other articles published on May 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X