
ధోనీ కళ్లలోకి చూడాలంటే..
అయితే మహీ కూడా అప్పుడప్పుడు ఆగ్రహానికి లోనయ్యేవాడని, ఆటగాళ్లపై కూడా అరిచేవాడని అతని సహచర ఆటగాళ్లు కొందరు ఇప్పటికే తెలియజేశారు. ధోనీ మైదానంలో చాలా తెలివిగా వ్యవహారిస్తాడని, బ్రేక్ సమయంలో కెమెరాలు ఫోకస్ చేయని క్రమంలో ఆటగాళ్లను మందలిస్తారని తెలిపారు. మైదానంలో ఏదైనా తప్పుచేసినప్పుడు ధోనీ కళ్లలోకి చూడాలంటే భయంగా ఉంటుందని, కనుసైగలతో అతను హెచ్చరించేవాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, సురేశ్ రైనా ధోనీ ప్రశాంతతను కోల్పోయిన సందర్భాలను చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు మహీ ఆగ్రహానికి లోనవ్వడం టీవీ కెమెరాల్లో కూడా కనిపించింది.

బ్యాట్ విసిరేసాడు..
అయితే లాక్‌డౌన్ సందర్బంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఒక్కొక్కరుగా మహీ ఆగ్రహానికి గురైన క్షణాలను గుర్తు చేసు కుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్‌లు క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. మిస్టర్ కూల్ ధోనీ ఫైర్ అయిన క్షణాలను నెమరువేసుకున్నారు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తప్పుగా తనను ఔటిచ్చారని కోపాద్రిక్తుడైన ధోనీ.. బ్యాట్‌ను నేలకు విసిరికొట్టాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.
‘2006-07లో ఓ వార్మప్ సెషన్‌లో మేం ఓ మ్యాచ్ ఆడాం. రెండు జట్లుగా విడిపోయి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ లెఫ్టాండ్ ఆడాలని, ఎడమచేతివాటం వాళ్లు కుడిచేతి ఆడాలనే నిబంధనను పెట్టుకున్నాం. ప్రాక్టీస్ సెషన్‌లో మాములుగా ఇలానే ఆడుతాం. అయితే ఆరోజు ధోనీని తప్పుగా ఔటిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మహీ.. బ్యాట్‌ను నేలకు కొట్టి డ్రెస్సింగ్ రూం గోడను గుద్దుతూ.. ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు అతని కోపాద్రిక్తుడయ్యాడు'అని ఈ బరోడా క్రికెటర్ తెలిపాడు.

2007 ప్రపంచకప్‌లో..
మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా ధోనీ కొన్నిసార్లు ఆగ్రహానికి గురవ్వడం తాను చూశానని వ్యాఖ్యానించాడు. కాకపోతే ఆ టైమ్‌లో ఇతర కెప్టెన్ల కన్నా మహీ చాలా ప్రశాంతంగా ఉండేవాడని తెలిపాడు. ‘ధోనీ ఆగ్రహానికి గురవ్వడం ఎప్పుడూ చూడలేదని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నేను కొన్నిసార్లు అతను కోపానికి గురవ్వడం చూశాను. 2007 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైనప్పుడు అతను ఆగ్రహానికి గురయ్యాడు. అతను ఓ మనిషే కాబట్టి అప్పుడప్పుడు సీరియస్ కావడం సహజమే. ఐపీఎల్‌లో చెన్నై తరఫున కూడా ధోనీ కొన్నిసార్లు కోపాద్రిక్తుడయ్యాడు. క్యాచ్‌లు వదిలేసినప్పుడు, మిస్ ఫీల్డ్ చేసినప్పుడు ఆటగాళ్లను మందలించాడు. కాకపోతే ఇతరులకంటే ధోనీ చాలా ప్రశాంతమైన సారథి. నాకన్నా చాలా కూల్ మ్యాన్'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

నాముందు వేషాలేయకు..
2014 న్యూజిలాండ్ పర్యటనలో ఓ బౌన్సర్ వేసి ధోనీతో చివాట్లు తిన్నానని భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ టూర్ సెకండ్ టెస్ట్‌లో క్యాచ్ డ్రాప్ చేయడంతో సహనం కోల్పోయిన తాను బౌన్సర్ వేసానని, అది కాస్త ధోనీకి అందకుండా బౌండరీకి వెళ్లిందన్నాడు. దీంతో లంచ్ బ్రేక్‌కు వెళ్తున్న సమయంలో మహీ తనవద్దకు వచ్చి తన ముందు వేశాలు వేయవద్దని మందలించాడని షమీ గుర్తు చేసుకున్నాడు. చాలా సీరియస్‌గా.. ‘చూడు బ్రదర్, నేను వస్తూ.. పోతున్న నీలాంటి ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. నా ముందు అబద్దాలు చెప్పకు. నేను నీ సీనియర్‌తో పాటు కెప్టెన్‌ని. నన్ను ఫూల్ చేయడానికి ప్రయత్నించకని ఆగ్రహం వ్యక్తం చేశాడు.' అని షమీ గుర్తు చేసుకున్నాడు.
కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్.. ట్రోలర్స్‌కు మహ్మద్ షమీ వైఫ్ కౌంటర్!


Click it and Unblock the Notifications
