న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవన్నీ తప్పుడు వార్తలే.. నేను బాగానే ఉన్నా: అఫ్రిది

Shahid Afridi says condition improving after contracting coronavirus over rumours around his health

లాహోర్‌: తన ఆరోగ్యం క్షీణించిందని జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. గతవారం కరోనా వైరస్‌ బారిన పడిన ఈ పాక్ మాజీ కెప్టెన్ తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. తాను మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్లు తెలిపాడు. ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన అఫ్రిది.. అసత్య వార్తలను నమ్మవద్దని, తన గురించి భయపడాల్సిన అవసరంలేదని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

నా పరిస్థితి మెరుగైంది..

నా పరిస్థితి మెరుగైంది..

‘కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో నా ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాంతో నేను స్పష్టత ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. వైరస్‌ సోకిన మొదట్లో.. రెండు, మూడు రోజులు చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే, ఇప్పుడు నా పరిస్థితి మెరుగైంది. క్రమంగా కోలుకుంటున్నా. నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారిపై మీకు మీరుగా పోరాడకపోతే దాన్ని జయించలేరు. అయితే, నాకు కూడా ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంది' అని అఫ్రిది అన్నాడు.

పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్.

నా పిల్లల్ని మిస్సవుతున్నా

నా పిల్లల్ని మిస్సవుతున్నా

ఇక తన పిల్లలను చూడకుండా ఉండటం తనకు చాలా కష్టంగా ఉందని అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద కష్టం నా పిల్లల్ని చూడకుండా ఉండటం.. వాళ్లని తాకలేకపోవడం. నా పిల్లలను చాలా మిస్సవుతున్నా. కానీ, జాగ్రత్తలుతో పాటు భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ల క్షేమం కోసం ఇదెంతో అవసరం' అని అఫ్రిది అభిమానులకు సూచించాడు.

ముందే తెలుసు..

ముందే తెలుసు..

ఇక తాను కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని ముందే తెలుసని అఫ్రిది చెప్పుకొచ్చాడు. ‘ఈ కష్ట కాలంలో పేదలకు సాయం చేయడానికి అనేక ప్రాంతాలు తిరుగుతున్నందున ఇలా జరుగుతుందని ముందే ఊహించా. అదృష్టంకొద్దీ చాలా ఆలస్యంగా నాకు వైరస్‌ సోకింది. లేకపోతే ఇతరులకు సాయం చేసే అవకాశం తనకు దక్కేదికాదు. నా క్షేమం కోరుతూ.. ప్రార్థనలు చేస్తున్న అభిమానులు, సహచరులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు.'అని అఫ్రిది ముగించాడు.

గత శనివారమే..

గత శనివారమే..

రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడిన అఫ్రిది గత శనివారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆరోజే అఫ్రిది ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'గురువారం నుంచి నేను కొంచెం అస్వస్థతకు లోనయ్యా. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తు పాజిటీవ్ అని తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీరంతా ఇంట్లోనే భద్రంగా ఉండండి' అని ఈ పాక్ మాజీ కెప్టెన్ ట్వీట్ చేశాడు. ఇక అఫ్రిది మహమ్మారి నుంచి కోలుకోవాలని అతని చిరకాల ప్రత్యర్థి గౌతమ్ గంభీర్ ఆకాంక్షించిన విషయం తెలిసిందే.

క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్.. మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్!

Story first published: Thursday, June 18, 2020, 11:52 [IST]
Other articles published on Jun 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X