న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవకాశాలు వదులుకోవద్దు.. పాక్ ఆటగాళ్లకు అఫ్రిది చురక!

Shahid Afridi, Michael Vaughan react to Pakistan’s loss to England in 1st Test

కరాచీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో పాకిస్థాన్ గెలుపు ముంగిట బొక్కబోర్లాపడిన విషయం తెలిసిందే. గంటగంటకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన పోరులో చివరకు ఆతిథ్య జట్టే పైచేయి సాధించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్పగా ఆడిన ఆ జట్టు 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. విజయం దక్కేవరకు అద్భుతంగా పోరాడిన ఇంగ్లండ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంటే.. విజయవకాశాలను చేజార్చుకున్న పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దని ట్విటర్ వేదికగా చురకలంటించాడు.

ఇలాంటి అవకాశాలు వదులుకోవద్దు..

ఇలాంటి అవకాశాలు వదులుకోవద్దు..

‘అద్భుత విజయాన్నందుకున్న ఇంగ్లండ్‌కు అభినందనలు. వోక్స్, బట్లర్ బ్రిలియంట్‌గా బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ మొత్తాన్ని పాకిస్థాన్ గ్రిప్‌లోకి తెచ్చుకుంది. కానీ దురదృష్టవశాత్తు గెలిచే మ్యాచ్ చేజారింది. ఇలాంటి అవకాశాలను ఏ మాత్రం వృథా చేసుకోవద్దు. పిచ్ పాకిస్థాన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. 'అని ట్వీట్ చేశాడు.

ఇరు జట్ల పోరు..

ఇరు జట్ల పోరు..

ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ఇరు జట్ల ఆటగాళ్లను ప్రశంసించాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఫాలో కావాల్సిన అత్యత్తమ జట్లు ఇంగ్లండ్, పాకిస్థాన్.. ఎవరి విజయాన్ని అంచనావేయలేం. కానీ ఇరు జట్ల పోరు చూడటం ఉత్సాహంగా ఉంటుంది'అని ట్వీట్ చేశాడు. మరో పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ సైతం పాక్ ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖం చాటేసుకునే ఏమోజీలను ట్వీట్ చేశాడు.

ఇంకా రెండు మ్యాచ్‌లు..

ఇంకా రెండు మ్యాచ్‌లు..

పాక్ కెప్టెన్ అజార్ అలీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..‘ఓటమి నిరాశకు గురిచేసింది. కానీ ఈ మ్యాచ్‌తోనే అయిపోలేదు. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో మాకు చాలా సానుకూలంశాలు కనిపించాయి. ఇంగ్లండపై మేమే ఆధిపత్యం కనబర్చాం. సెకండ్ ఇన్నింగ్స్ వల్లే ఓడామని చెప్పను. కానీ ఇంగ్లండ్‌ను ఓడించే అవకాశం చేజార్చుకున్నాం. ఇంకో వికెట్ పడగొట్టుంటే మ్యాచ్ గెలిచేవాళ్లం. కానీ బట్లర్ వోక్స్ అద్భుతంగా ఆడారు. మా గెలుపును లాగేసుకున్నారు. కొన్ని ప్రత్యర్థి ఆటను కూడా మెచ్చుకోవాల్సిందే.

రాణించిన వోక్స్, బట్లర్..

రాణించిన వోక్స్, బట్లర్..

నాలుగో రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. క్రిస్‌ వోక్స్‌ (84 నాటౌట్‌), బట్లర్‌ (75) అసమాన ఆటతీరుతో మ్యాచ్‌ను చివరి రోజు వరకు తీసుకెళ్లకుండా 3 వికెట్ల తేడాతో గెలిచింది. వీరి మధ్య ఐదో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 82.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌లో రూట్‌ సేన 1-0తో ఆధిక్యంలో ఉంది.

విరాట్ కోహ్లీలానే ధోనీకి దూకుడెక్కువ.. కాకపోతే మాటల్లో కనిపించదంతే : మాజీ సెలెక్టర్

Story first published: Sunday, August 9, 2020, 15:38 [IST]
Other articles published on Aug 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X