న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ముందు వేషాలేయకంటూ ధోనీ మందలించాడు: షమీ

‘See brother, I have seen many players come and go- When MS Dhoni told Mohammed Shami after bowling a bouncer out of anger

కోల్‌కతా: ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని భారత పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. తన ముందు వేషాలు వేయవద్దని, ఎంతో మంది ఆటగాళ్లను చూశానని మహీ భాయ్ మందలించాడని ఈ బెంగాల్ పేసర్ గుర్తుచేసుకున్నాడు. తన సహచర ఆటగాడు మనోజ్ తివారీతో శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌‌లో మాట్లాడిన షమీ.. తనపై ధోనీ సీరియస్ అయిన ఘటనను నెమరు వేసుకున్నాడు.

2014 న్యూజిలాండ్ టూర్‌లో..

2014 న్యూజిలాండ్ టూర్‌లో..

2014 న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన సెకండ్ మ్యాచ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాటి ఆతిథ్య జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడని షమీ తెలిపాడు. అయితే 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ వదిలేసాడని, దాంతో చెలరేగిన కివీస్ కెప్టెన్ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడన్నాడు.

అసహనంతో బౌన్సర్ వేసా..

అసహనంతో బౌన్సర్ వేసా..

అప్పటికే వారి ఆటతో భారత బౌలర్లు అసహనానికి గురయ్యారని, ఈ క్రమంలో తన బౌలింగ్‌లో మరో బ్యాట్స్‌మన్ క్యాచ్‌ను భారత ఫీల్డర్లు వదిలేశారని తెలిపాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన తాను.. మరుసటి బంతిని బౌన్సర్‌గా సంధించానన్నాడు. ఆ బంతి కాస్త ధోనీకి అందకుండా బౌండరీకి వెళ్లిందని, దీంతో అతను తనను మందలించాడని గుర్తు చేసుకున్నాడు.

బౌన్సర్ ఎందుకేసావ్? అన్నాడు..

బౌన్సర్ ఎందుకేసావ్? అన్నాడు..

‘సరిగ్గా లంచ్‌కు ముందు నేను వేసిన బంతి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేసింది. కానీ మన ఫీల్డర్లు దాని వదిలేశారు. ఆ ఓవర్ చివరి బంతిని నేను బౌన్సర్‌గా సంధించా. అది కాస్త మహీ భాయ్‌కు అందకుండా తలపై నుంచి బౌండరీ వెళ్లింది. అనంతరం లంచ్ బ్రేక్‌తో డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుస్తుండగా.. ధోనీ భాయ్ నా దగ్గరకు వచ్చి చివరి బంతిని అలా ఎందుకు వేసావ్? అని అడిగాడు.

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

చూడు బ్రదర్ అంటూ కోప్పడ్డాడు..

చూడు బ్రదర్ అంటూ కోప్పడ్డాడు..

దానికి నేను సరైన సమాధానం చెప్పలేకపోయాను. దీంతో ఆగ్రహానికి గురైన మహీ భాయ్ తన ముందు వేశాలు వేయవద్దని మందలించాడు. చాలా సీరియస్‌గా.. చూడు బ్రదర్, నేను వస్తూ.. పోతున్న ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. నా ముందు అబద్దాలాడకు. నేను నీ సీనియర్‌తో పాటు కెప్టెన్‌ని. నన్ను ఫూల్ చేయకని నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.'అని షమీ చెప్పుకొచ్చాడు.

గోల్డెన్ చాన్స్ మిస్..

గోల్డెన్ చాన్స్ మిస్..

ఇక ఆ మ్యాచ్‌లో గెలిచే గోల్డెన్ చాన్స్‌ను మహీసేన చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 192 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం భారత్ 438 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో తడబడిన బ్లాక్ క్యాప్స్ ఒకానొక దశలో 94/5తో కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో నాటి కివీస్ సారథి బ్రెండన్ మెకకల్లమ్(302) ట్రిపుల్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు. అతనికి తోడు వాట్లింగ్(124), నీషమ్ (137) సెంచరీలతో చెలరేగడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను 680/8 స్కోర్ వద్ద డిక్లెర్ చేసింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 166/3 రన్స్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్ 1-0తో ఆతిథ్య జట్టు వశమైంది.

ధావన్ ఓ ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడటానికి ఇష్టపడడు: రోహిత్

Story first published: Saturday, May 9, 2020, 15:24 [IST]
Other articles published on May 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X