న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

Did You Know Sachin Tendulkars Ball Tampering and Suspension controversy

హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదస్పద ఘటన.. మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు, అతనితోపాటు మొత్తం ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్సెన్షన్ విధించడంతో యావత్ భారతం అట్టుడికింది. ఈ వ్యవహారంపై భారత పార్లమెంట్ కూడా స్థంభించింది. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన ఈ సంఘటన టీమిండియా 2001 సౌతాఫ్రికా పర్యటనలో చోటుచేసుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఎలిజబెత్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ ఈ వివాదానికి కేంద్ర బిందువైంది.

బంతి సీమ్ క్లీన్ చేసిన సచిన్..

బంతి సీమ్ క్లీన్ చేసిన సచిన్..

ఈ టెస్ట్ మూడో రోజు ఆటలో సచిన్ టెండూల్కర్ బంతి సీమ్‌ను క్లీన్ చేస్తున్న విజువల్స్ టీవీ కెమెరాల్లో కనిపించాయి. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి సీమ్‌ను అంపైర్ సమక్షంలోనే చేయాలి. కానీ సచిన్ అలా కాకుండా బంతిని సీమ్‌ను క్లీన్ చేశాడు. ఈ విజువల్స్ గమనించిన నాటి మ్యాచ్ రిఫరీ, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైక్ డెన్నిస్ సచిన్‌పై బాల్ ట్యాంపరింగ్ అభియోగాలు మోపాడు. దీనికి ససేమిరా అన్న సచిన్ ఈ వ్యవహారాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు.

సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు బంతి ఆకారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఎవరైనా బంతి ఆకారాన్ని దెబ్బతీస్తే.. అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తారు. కానీ ఆ రోజు బంతి ఆకారం విషయంపై ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ మైక్ డెన్నిస్ సీసీ ఫుటేజ్ ఆధారంగా సుమోటోగా స్వీకరించి.. సచిన్‌పై టాంపారింగ్ అభియోగాలు మోపాడు.

ససేమిరా అన్న సచిన్..

ససేమిరా అన్న సచిన్..

సచిన్ ఈ టాంపరింగ్ చార్జెస్‌ను అంగీకరించలేదు. తాను బంతి సీమ్‌ను క్లీన్ చేసిన మాట వాస్తవమేనని, అంపైర్లకు చెప్పడం కూడా మర్చిపోయానని తెలిపాడు. కానీ బాల్ టాంపారింగ్‌కు మాత్రం ప్రయత్నించలేదని స్పష్టం చేశాడు. తనపై అనుమానం ఉంటే ఫీల్డ్ అంపైర్లను సంప్రదించాలని రిఫరీ డెన్నిస్‌కు సూచించాడు. మైదానంలోని ఆటకు వారే న్యాయనిర్ణేతలుగా ఉన్నారని తెలిపాడు.

సచిన్‌తో సహా ఐదుగురిపై సస్సెన్షన్..

సచిన్‌తో సహా ఐదుగురిపై సస్సెన్షన్..

ఇవేవి పట్టించుకోని డెన్నిస్.. బాల్ టాంపరింగ్ అభియోగాలతో సచిన్ టెండూల్కర్‌పై, అతిగా అప్పీల్ చేసిన కారణంగా హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, శివ్ సుంధర్ దాస్, దీప్ దాస్‌గుప్తాలపై ఓ టెస్ట్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నాడు. ఇక కెప్టెన్‌గా ఆటగాళ్లను కంట్రోల్ చేయని కారణంగా సౌరవ్ గంగూలీకి మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక టెస్ట్, రెండు వన్డేలు ఆడకుండా బ్యాన్ విధించాడు. అయితే భారత ఆటగాళ్ల కంటే ఎక్కువ అప్పీల్ చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లలో ఒక్కరిపై చర్యలు తీసుకుపోవడం అప్పట్లో అందరిని విస్తుకొలిపింది.

డెన్నిస్ ఉద్దేశపూర్వకంగా తమపై చర్యలు తీసుకున్నాడని ప్రతిఘటించిన భారత ఆటగాళ్లు.. తమపై మోపిన అభియాగాలను తిరస్కరించారు. ఈ వ్యవహారాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ.. ఈ శిక్షలు చాలా పక్షపాతంగా ఉన్నాయని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో వాదించింది.

బహిష్కరిస్తామని హెచ్చరిక..

బహిష్కరిస్తామని హెచ్చరిక..

మూడో టెస్ట్‌ను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో మిలియన్ల డాలర్లు నష్టపోతామని గ్రహించిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.. డెన్నిస్‌ను తొలగిస్తూ మూడో టెస్ట్‌కు మరో రిఫరీని నియమించింది. డెన్నిస్‌ను కనీసం ఆ మైదానంలోకి కూడా అనుమతించలేదు. ఈ విషయంలో డెన్నిస్‌కు ఐసీసీ మద్దతుగా నిలిచింది. దీంతో ఐసీసీ సెహ్వాగ్ మినహా.. మిగతా భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ ఎత్తేసి.. ఇరు జట్లు అంగీకారంతో మూడో టెస్ట్‌ను అనధికారిక మ్యాచ్‌గా ప్రకటించింది. దీంతో సౌతాఫ్రికా 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

అసభ్య పదజాలం, అంపైర్లతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా సెహ్వాగ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయలేదు. దీన్ని బీసీసీఐ అంగీకరించనప్పటికీ.. క్రికెట్ భవిష్యత్తు దృష్ట్యా ఈసీబీ, ఐసీసీ విజ్ఞప్తి మేరకు ఆ సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌‌కు సెహ్వాగ్‌ను పక్కనబెట్టింది.

అఫ్రిది ఆల్‌టైమ్ వరల్డ్‌‌కప్ ఎలెవన్.. యూవీ, సచిన్‌, ధోనీకి నోచాన్స్!

Story first published: Friday, May 8, 2020, 17:30 [IST]
Other articles published on May 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X