Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్ ఓ ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడటానికి ఇష్టపడడు: రోహిత్ శర్మ

 Rohit Sharma explains why its frustrating to open batting with Shikhar Dhawan


న్యూఢిల్లీ:
తన సహచర ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ ఇడియట్ అని రోహిత్ శర్మ తెలిపాడు. తొలి బంతిని ఎదుర్కోవడానికి ధావన్ ఇష్టపడడన్నాడు. శుక్రవారం ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న హిట్ మ్యాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా ధవన్‌‌తో ఇన్నింగ్స్‌‌ ప్రారంభించడంపై స్పందించాడు.
 ఫస్ట్ బాల్ స్ట్రైక్ తీసుకోడు..

ఫస్ట్ బాల్ స్ట్రైక్ తీసుకోడు..

‘ధావన్‌‌ ఓ మూర్ఖుడు. తొలి బంతిని ఎదుర్కోవడానికి ఏమాత్రం ఇష్టపడడు. స్పిన్‌‌ బౌలింగ్‌‌ ఆడేందుకు ఇష్టపడతాడు కానీ అటాక్‌‌ చేయడు. 2013 చాంపియన్స్‌‌ ట్రోఫీలో నేను ఫస్ట్‌‌ టైమ్‌‌ ఓపెనర్‌‌గా వచ్చా. నేనిప్పటి దాకా కొత్త బాల్‌‌ ఫేస్‌‌ చెయ్యలేదు, స్ట్రయిక్‌‌ తీసుకో అని శిఖర్‌‌కు చెప్పా. నువ్వు చాలా కాలంగా ఆడుతున్నావు.. నాకిదే ఫస్ట్‌‌ టూర్‌. నువ్వే స్ట్రయిక్‌‌ తీసుకో అని శిఖర్‌‌ నాకు చెప్పాడు. అంటే రెగ్యులర్‌‌ ఓపెనర్‌‌ అయిన మనిషికి స్ట్రయిక్‌‌ తీసుకోవడం ఇష్టం లేదనేగా. దాంతో నేనే స్ట్రయిక్​ తీసుకున్నా. మోర్నీ మోర్కెల్ వేసిన తొలి మూడు బంతులను కనీసం చూడలేకపోయా. బంతి బౌన్స్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదే ధావన్‌తో నాకున్న తొలి అనుభవం. ప్రస్తుతం అతనితో చాలా కంఫర్టబుల్​గా ఉన్నా. 'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

పరుగు తీసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

పరుగు తీసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

ఆటమధ్యలో ధావన్ చికాకు తెప్పిస్తాడని, ఒత్తిడికి గురయ్యేలా కూడా చేస్తాడని ఈ ముంబైకర్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పరుగు తీసే విషయంలో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ‘ఇప్పటికీ కొన్ని సార్లు చికాకు తెప్పిస్తాడు. వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో శిఖర్‌‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిఫెన్స్‌‌ ఆడి వెంటనే నాన్‌‌ స్ట్రయికర్‌‌ ఎండ్‌‌కు పరుగెడతాడు. రన్‌‌కు వెళ్లాలో లేదో నాకు అర్థం కాదు. అందుకే బాల్‌‌ గ్యాప్‌‌లోకి వెళ్తే కానీ రన్‌‌ చేయకూడదని డిసైడయ్యా. ఈ క్రమంలో చాలా రన్స్‌‌ మిస్‌‌ చేశా. కానీ ఎప్పుడూ బాధపడలేదు' అని రోహిత్‌‌ చెప్పుకొచ్చాడు.

హ్యాట్రికా.. నేనా?

హ్యాట్రికా.. నేనా?

2009 ఐపీఎల్‌‌లో డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు ఆడిన రోహిత్‌‌.. ముంబై ఇండియన్స్‌‌పై హ్యాట్రిక్‌‌ వికెట్లు సాధించాడు. అయితే, ఆ హ్యాట్రిక్‌‌ ఎలా సాధించానో ఇప్పటికీ అర్థం కావడం లేదని రోహిత్‌‌ చెప్పాడు. ‘ముంబైపై హ్యాట్రిక్‌‌ తీశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా. అప్పుడెలా బౌలింగ్‌‌ చేశానో కూడా గుర్తు లేదు' అన్నాడు.

లాస్ట్ బాల్ సింగిల్ మరవడు..

లాస్ట్ బాల్ సింగిల్ మరవడు..

ధావన్‌‌ సన్‌‌రైజర్స్‌‌కు ఆడేటప్పుడు తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని డేవిడ్ వార్నర్‌‌ కూడా చెప్పడం కొసమెరుపు. ‘సన్‌రైజర్స్ తరఫున ధావన్‌తో ఓపెనింగ్ చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతన్ని జడ్జ్ చేయడం మాత్రం చాలా కష్టం.'అన్నాడు. ఇక ధావన్‌లో తనకు బాగా నచ్చే విషయం మొదటి, చివరిబంతికి సింగిల్ తీయడమని ఈ విధ్వంసకర ఓపెనర్ తెలిపాడు.‘అతనిలో ఓ విషయం నాకు బాగా నచ్చుతుంది. అతను చివరి బంతికి సింగిల్ తీయడం చాలా ఇష్టపడుతాను. ఖచ్చితంగా విఫలమవ్వకుండా ఆ పని పూర్తి చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో తొలి బంతి, చివరి బంతికి సింగిల్ తీయడం మర్చిపోడు'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

Story first published: Saturday, May 9, 2020, 9:24 [IST]
Other articles published on May 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+