న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్ఫరాజ్‌ఖాన్ ట్రిపుల్ సెంచరీ.. రంజీల్లో అరుదైన ఘనత

Sarfaraz Khan joins Rohit Sharma, Sanjay Manjrekar in elite list after 301 not out

ముంబై : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వాంఖడే వేదికగా ఉత్తరప్రదేశ్‌తో బుధవారం ముగిసిన రంజీ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ముంబై తరఫున ఈ ఘనతనందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

దిగ్గజాల సరసన..

దిగ్గజాల సరసన..

సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబై తరఫున ట్రిపుల్ సెంచరీలు సాధించగా.. తాజాగా సర్ఫరాజ్ ఈ ఫీట్ సాధించి వారి సరసన చేరాడు. సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ ఓవరాల్‌గా ముంబై తరఫున 8వది కాగా.. వసీం జాఫర్ రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. చివరికి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియగా.. కెరీర్‌లో సర్ఫరాజ్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు.

ధీటుగా బదులిచ్చిన ముంబై..

ధీటుగా బదులిచ్చిన ముంబై..

ఆదివారం మొదలైన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరప్రదేశ్ 159.3 ఓవర్లలో 625/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఉపేంద్ర యాదవ్ (239 బంతుల్లో 27ఫోర్లు, 3 సిక్సర్లతో 203) డబుల్ సెంచరీ సాధించగా.. అక్షదీప్ నాథ్ (217 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు.

మా ఆటగాళ్లతో పోల్చితే కోహ్లీ చాలా లక్కీ : పాక్ మాజీ క్రికెటర్

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై 128 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. అజేయ ట్రిపుల్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. సిద్దేశ్ లాడ్ (174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 98), ఆదిత్య తారె (144 బంతుల్లో 14 ఫోర్లతో 97) సెంచరీలు చేజార్చుకున్న అండగా నిలిచారు. దీంతో ఆ జట్టు 166.3 ఓవర్లలో 688/7 వద్ద డిక్లేర్ చేసింది.

మొత్తానికి.. బౌలర్లకి చుక్కలు కనిపించిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 1,313 పరుగులు నమోదయ్యాయి.

 ట్రిపుల్ సెంచరీ

ట్రిపుల్ సెంచరీ

ఇక సర్ఫరాజ్ తన మాజీ జట్టుపైనే ట్రిపుల్ సెంచరీ సాధించడం విశేషం. ముంబైకి చెందిన సర్ఫరాజ్ గతంతో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడాడు. 2015లో ఉత్తర్ ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్.. తన ప్రస్తుత టీమ్ ముంబైపై ఇదే వాంఖడే వేదికగా 47 పరుగులు చేశాడు.

థ్యాంక్యూ ముంబై..

థ్యాంక్యూ ముంబై..

ముంబై తరఫున ఆడేందుకు మరో అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు సర్ఫరాజ్ ఖాన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘చాలా రోజుల తర్వాత సెంచరీ చేశా. ముంబై తరఫున తొలి సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది'అని మంగళవారం సెంచరీ పూర్తైన అనంతరం సర్ఫరాజ్ తెలిపాడు.

భళా యువ భారత్.. మీ క్రీడా స్పూర్తికి సలామ్

ఇదంతా ఒక కలలా ఉంది

ఇక ఉత్తర్ ప్రదేశ్ తరఫున ఆడటం తన నాన్న, కోచ్ నౌషద్ ఖాన్ నిర్ణయమని ఈ 22 ఏళ్ల క్రికెటర్ తెలిపాడు. ‘ముంబై జట్టును వదిలి యూపీకి వెళ్తున్నప్పటి క్షణాలు నాకింకా గుర్తున్నాయి. ముంబై నాకున్న ప్రేమతో నా కళ్లేంట నీళ్లు వచ్చాయి. మళ్లెప్పుడు ముంబై తరఫున ఆడుతాననుకోలేదు. ముంబై తరఫున ఆడుతున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఒక కలలా ఉంది. "

ఐపీఎల్‌లో తళుక్కుమన్నా..

ఐపీఎల్‌లో తళుక్కుమన్నా..

ఇండియా క్యాష్ రిచ్ లీగ్‌ ఐపీఎల్‌.. 2015 సీజన్‌లోనే సర్ఫరాజ్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌కు ఎంపికయ్యాడు. ఆ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలర్లని అద్భుత షాట్లతో ఎదుర్కొని అలరించాడు. భారీ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత 2016 అండర్-19 ప్రపంచకప్‌‌లో భారత్‌ ఫైనల్‌ చేరడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ యువ హిట్టర్.. ఆ ఏడాది ఐపీఎల్‌లో రాణించాడు. కానీ.. ఫిట్‌నెస్ లేమి కారణంగా అతని కెరీర్ గాడి తప్పింది. అతను విఫలమైనప్పుడల్లా బొద్దుగా ఉండడాన్ని విమర్శకులు టార్గెట్ చేశారు. దీంతో అతను అవకాశాలు అందుకోలేకపోయాడు.

Story first published: Wednesday, January 22, 2020, 20:16 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X