Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా ఆటగాళ్లతో పోల్చితే కోహ్లీ చాలా లక్కీ : పాక్ మాజీ క్రికెటర్

Abdul Razzaq Says Virat Kohli lucky to have BCCI backing

ఇస్లామాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మించి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు తమ దేశంలో ఉన్నారని పాకిస్థాన్ మాజీప్లేయర్ అబ్దుల్ రజాక్ తెలిపాడు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వారిని పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో విరాట్ కోహ్లీ చాలా అదృష్టవంతుడని తెలిపాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కోహ్లీకి మద్దతు లభిస్తోందని, దాంతోనే అతను రాణిస్తున్నాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

'విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బీసీసీఐ నుంచి కూడా అతనికి పూర్తి సపోర్ట్ లభిస్తోంది. దీంతోనే అతను బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. పాకిస్థాన్‌లోనూ విరాట్ కోహ్లీకి మించిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కానీ.. మా దేశ క్రికెట్ బోర్డు వారిని పట్టించుకోవడం లేదు. వారితో పోలిస్తే..? బీసీసీఐ మద్దతు అందుకుంటున్న విరాట్ కోహ్లీ చాలా అదృష్టవంతుడు' అని రజాక్ చెప్పుకొచ్చాడు.

ఇక గతేడాది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సాయం చేస్తానని ప్రకటించడంపై కూడా రజాక్ తాజాగా స్పందించాడు.

'క్రికెట్ పరంగా పాండ్యా మెరుగయ్యేందుకు సాయం చేస్తానని అప్పట్లో చెప్పాను. కానీ.. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాదు.'అని స్పష్టం చేశాడు. బుమ్రా తను ముందు ఓ బచ్చాగాడని కామెంట్ చేసిన రజాక్.. సుదీర్ఘకాలం పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన తాను వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లను ఎదుర్కొన్నాననీ.. అందులో గ్రేట్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీమ్‌ అక్రమ్‌ లాంటి వారు ఉన్నారన్నారని వారితో పోలీస్తే బుమ్రా తన ముందు ఓ బచ్చాగడని వ్యాఖ్యానించాడు.

బుమ్రా యాక్షన్ భిన్నం

"నా కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న తరువాత, బుమ్రా వంటి బౌలర్‌పై నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. అతనిపైనే ఒత్తిడి ఉండేది. బుమ్రా చాలా బాగా రాణిస్తున్నాడు. చాలా మెరుగయ్యాడు కూడా. అతడి యాక్షన్ భిన్నంగా ఉంటుంది. సీమ్‌ను ఖచ్చితంగా ఉంటుంది కాబట్టే అతను ప్రభావవంతమైన ఆటగాడు కాగలిగాడు" అని రజాక్ అన్నాడు.

భారత ఆటగాళ్లపై ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ రజాక్ నోరుపారేసుకుంటాడు. ఇక అతని తీరుపై భారత అభిమానులు కూడా ఎప్పటికప్పుడూ బదులిస్తుంటారు.

Story first published: Wednesday, January 22, 2020, 18:48 [IST]
Other articles published on Jan 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+