న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ సర్ఫరాజ్.. వికెట్ల వెనుకాల నిద్రపోతున్నావా..? లేక స్టంపౌట్‌కు బ్యాట్స్‌మన్ పర్మీషన్ కావాలా?

Sarfaraz Ahmed misses an easy chance to dismiss Moeen Ali behind the stumps

మాంచెస్టర్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ నెటిజన్ల దృష్టిలో ఓ జోకర్‌లా మారాడు. మూడు ఫార్మాట్లలో ఆవలింతలు తీసిన ఏకైక ఆటగాడంటూ మొన్ననే అతన్ని ఓ ఆట ఆడుకున్న అభిమానులు.. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో సులువైన స్టంపౌట్‌ను మిస్ చేయడంతో ఉతికారేస్తున్నారు. వికెట్ల వెనుకాల నిద్రపోతున్నావా? లేక టూర్ మొత్తం బెంచ్‌కే పరిమితమై.. ఈ మ్యాచ్‌లో ఆడటం లేదనే భ్రమలో ఉన్నావా? అనే ఫన్నీకామెంట్స్‌తో సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంతకేం జరిగిందంటే..

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఇమాద్ వాసిమ్ వేసిన 11 ఓవర్ నాలుగో బంతిని మోయిన్ అలీ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సై కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ చేతిలో పడింది. అయితే అలర్ట్‌గా లేని సర్ఫరాజ్ సులువైన స్టంప్‌ ఔట్‌ను చేజార్చాడు. బంతి చేతిలో ఉన్నా వికెట్లకు కొట్టకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. సర్ఫరాజ్ తీరును చూసిన ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. అప్పుడు మోయిన్ అలీ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను గెలిపించేంత పనిచేశాడు. కానీ వహాబ్ రియాజ్ అద్భుత బౌలింగ్‌తో రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో పాక్ ఊపిరి పీల్చుకుంది.

బ్యాట్స్‌మన్ పర్మీషన్ కావాలా..?

ఇక మైదానంలో సర్ఫరాజ్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వహాబ్ రియాజ్ అలీని ఔట్ చేయకుంటే పాక్ పరిస్థితి మరోలా ఉండేదని, అయినా బంతి చేతిలో పడ్డాక వికెట్లను కొట్టకుండా బ్యాట్స్‌మన్ పర్మీషన్ కోసం ఎదురు చూస్తున్నావా? అని సర్ఫరాజ్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘మ్యాచ్ గెలిచి బతికిపోయావ్.. లేకుంటే నీకు ఉండేది'అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా కావాలనే చేజార్చినట్లు అనిపింస్తుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్ట్‌లు, రెండు టీ20ల్లో బెంచ్‌కే పరిమితమైన సర్ఫరాజ్.. ఆఖరి మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. అటు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. వికెట్ కీపర్‌గా జట్టుకు తీవ్ర నష్టం కలిగించాడు. ముఖ్యంగా మోయిన్ అలీ స్టంపౌట్ చేజార్చడంతో పాక్ తగిన మూల్యం చెల్లించుకుంది.

చెలరేగిన హఫీజ్, హైదర్ అలీ...

మహ్మద్ హఫీజ్(52 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 నాటౌట్), అరంగేట్ర ఆటగాడు హైదర్ అలీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 5 పరుగులతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీయగా.. మోయిన్ అలీ, టామ్ కరన్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. టామ్ బాంటన్(46), మోయిన్ అలీ(61) చెలరేగిన ఫలితం లేకపోయింది. ప్రత్యర్థి బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, వహాబ్ రియాజ్ రెండేసి వికెట్లు తీయగా... ఇమాద్ వాసిమ్, హారీస్ రౌఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ హఫీజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్

ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్

ఇంగ్లండ్‌తో గత ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 సందర్భంగా.. రిజర్వ్ బెంచ్‌పై కూర్చున్న సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కెమెరాకు చిక్కాడు. దాంతో మూడు ఫార్మాట్లలోనూ ఆవలింతలు తీసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పావంటూ సర్ఫరాజ్‌పై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చారు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో తొలిసారి ఆవలింతలు తీస్తూ సర్ఫరాజ్ అహ్మద్ నెటిజన్ల చేతికి చిక్కాడు. మ్యాచ్‌‌లో విరాట్ కోహ్లీ వికెట్ల మధ్య వేగంతో పరుగు తీస్తుంటే.. వికెట్ల వెనుక ఉన్న సర్ఫరాజ్ ఆవలింతలు తీస్తూ కనిపించాడు. దీంతో పాక్ అభిమానులు దుమ్మెత్తిపోశారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్‌ని పూర్తిగా బెంచ్‌పైనే కూర్చోబెట్టేసింది. అప్పుడు కూడా మనోడు ఆవలింత తీసి అబాసుపాలయ్యాడు.

సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో విభేధాల్లేవ్.. వ్యక్తిగత కారణాలతోనే భార‌త్‌కు వచ్చా: సురేశ్ రైనా

Story first published: Wednesday, September 2, 2020, 15:29 [IST]
Other articles published on Sep 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X