Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో విభేధాల్లేవ్.. వ్యక్తిగత కారణాలతోనే భార‌త్‌కు వచ్చా: సురేశ్ రైనా

Suresh Raina clarifies that there is no differences between him and csk management

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్పందించాడు. తన నిష్క్రమణకు గల కారణాన్ని తెలియజేశాడు. కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఫ్రాంచైజీతో విభేదాలు.. రైనా నిష్క్రమణకు కారణాలంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో విభేదాలనే వార్తల్లో నిజం లేదని, బంధువుల అకాల మరణంతోనే ఇలా భారత్‌కు రావాల్సి వచ్చిందని రైనా స్పష్టం చేశాడు. తాజాగా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

బలమైన కారణం లేకుండా..

బలమైన కారణం లేకుండా..

‘ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. కష్టకాలంలో నా కుటుంబానికి మద్దతుగా ఉండాలనే భారత్‌కు వచ్చా. సీఎస్కే కూడా నా కుటుంబంలాంటిదే. నాకు మహీభాయ్ చాలా ముఖ్యం. ఇది చాలా కఠిన నిర్ణయమే. అయితే సీఎస్‌కేతో నాకు ఎలాంటి విభేధాల్లేవ్. బలమైన కారణం లేకుండా ఏ ఆటగాడు కూడా రూ.12.5 కోట్ల రూపాయలను వదులుకోవడానికి సిద్దపడడు. నేను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చు. కానీ నా వయసేం అయిపోలేదు. మరో నాలుగు, ఐదేళ్లు ఐపీఎల్ ఆడుతా.'అని రైనా స్పష్టం చేశాడు.

శ్రీనివాసన్‌కు కారణం తెలియదు..

శ్రీనివాసన్‌కు కారణం తెలియదు..

కీలక సమయంలో రైనా టోర్నీ నుంచి తప్పుకోవడంపై చెన్నై జట్టు ఓనర్ ఎన్ శ్రీనివాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రైనాకు విజయ గర్వం తలకెక్కిందనే ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తానేం బాధపడలేదని రైనా తెలిపాడు. తనకు శ్రీనివాసన్ తండ్రిలాంటోడని, ఫాదర్ తిడితే బాధపడతామా?అని ఎదురు ప్రశ్నించాడు.

‘నన్ను శ్రీనివాసన్ తన చిన్నకొడుకులా భావిస్తాడు. ఆయన నాపై చేసిన వ్యాఖ్యలు సందర్భ రహితం. ఏ తండ్రైనా కొడుకును తిట్టవచ్చు. అయితే నేను జట్టు వీడటానికి గల బలమైన కారణాలు ఆయనకు తెలియవు. అందుకే ఆయన కొంత ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు ఆయనకు అసలు విషయం తెలిసింది. వెంటనే నాకు మెసేజ్ కూడా చేశాడు. ఈ విషయంపై చాలా మాట్లాడుకున్నాం.'అని రైనా చెప్పుకొచ్చాడు.

దుబాయ్ క్యాంప్‌లో మళ్లీ చూడవచ్చు..

దుబాయ్ క్యాంప్‌లో మళ్లీ చూడవచ్చు..

ఇక సీఎస్కేతో తన ప్రయాణం ముగిసిందనే వార్తల్లో కూడా నిజంలేదని రైనా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇక్కడ క్వారంటైన్‌లో ఉన్న తాను.. ప్రాక్టీస్ కొనసాగిస్తున్నానని, త్వరలో దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్‌లో మళ్లీ చూడవచ్చని కూడా తెలిపాడు. బయో బబుల్ వాతావరణం గురించి మాట్లాడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ ప్రతి ఒక్కరి భద్రత కోసం మంచి ఏర్పాట్లు చేశాయని తెలిపాడు.

‘ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి వాతావరణాన్ని చూడలేదు. ఇది ప్రతి ఒక్కరికి కొత్తనే. చాలా భద్రతతో కూడిన వాతావరణం. ఏ ఒక్కరు అనుమతి లేకుండా బయటకు వెళ్లలేరు. మానవ సంబంధాలు లేకుండా మేమంతా గదులకే పరిమితమయ్యాం. రెండు రోజులుకోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.'అని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ తెలిపాడు.

కుటుంబమే ముఖ్యం అనిపించింది..

కుటుంబమే ముఖ్యం అనిపించింది..

బయోబబుల్ వాతావరణాన్ని అసౌకర్యంగా ఫీలయ్యారనే వార్తలపై స్పందిస్తూ.. అన్నిటి కంటే తనకు ఫ్యామిలీ ముఖ్యం అనిపించిందని ఈ స్టార్ ప్లేయర్ తెలిపాడు. ‘నా ఫ్యామిలీని వదిలేసి నేను దుబాయ్‌కు వచ్చాను. ఇక్కడ నాకు ఏమైన జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటిదనే ఆందోళన నన్ను వెంటాడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నిటి కన్నా నా కుటుంబమే ముఖ్యం అనిపించింది. నా పిల్లలను చూడకుండా 20 రోజులు అవుతుంది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న నేను ఇప్పటికీ వారిని తాకలేదు.'అని చెప్పుకొచ్చాడు.

ఇక తన మామ కుటుంబంపై జరిగింది చాలా దారుణమని, ఈ ఘటన తమ కుటుంబంలోని ప్రతీ ఒక్కరిని డిస్టర్బ్ చేసిందన్నాడు. ‘ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండటం నా బాధ్యత. ఆ కారణంతోనే ఇక్కడకు వచ్చాను. కానీ క్వారంటైన్ వల్ల ఇప్పటి వరకు వారిని కలవలేకపోయాను.' అని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు.

England vs Pakistan: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన హైదర్ అలీ.. చెలరేగిన హఫీజ్.. సిరీస్ సమం!

Story first published: Wednesday, September 2, 2020, 14:16 [IST]
Other articles published on Sep 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+