న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ధోనీకి భయపడతానా? ఒక సారి నా దోస్తులను అడుగు సర్: సంజయ్ మంజ్రేకర్

Sanjay Manjrekar Responds After A Twitter user accuses He Scared Of Criticising MS Dhoni

న్యూఢిల్లీ: వివాదాస్పద కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఐపీఎల్ 2020 కామ్ బాక్స్‌లో అవకాశం దక్కకున్నా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆటగాళ్లపై ఎప్పుడూ ఏదో ఒకటి కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకునే మంజ్రేకర్.. తన నోటి దురుసుతో బీసీసీఐ వేటుకు గురయ్యాడు. అయితే క్రికెట్ వ్యాఖ్యానానికి దూరమైనా.. మ్యాచ్‌లపై విశ్లేషణలు చేస్తూ క్రికెట్ వరల్డ్‌కు టచ్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ ఫలితంపై ట్విటర్ వేదికగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆఖరి ఓవర్‌లో ఓడిన విషయం తెలిసిందే.

కర్ణ్ శర్మతో వేయించాల్సింది..

కర్ణ్ శర్మతో వేయించాల్సింది..

బ్రావో గాయంతో మైదానం వీడటంతో ధోనీ కర్ణ్ శర్మను కాదని రవీంద్ర జడేజాతో చివరి ఓవర్ బౌలింగ్ చేయించాడు. ఇది కాస్త బెడిసి కొట్టడంతో గెలిచే మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే మంజ్రేకర్ ట్వీటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘క్రీజులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఉన్నప్పుడు నేనైతే జడేజాతో కాకుండా కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించేవాడిని. మణికట్టు స్పిన్నర్లు అద్భుతమైన గూగ్లీలతో లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు. పైగా పిచ్‌పై ఎక్స్‌ట్రా బౌన్స్ కూడా ఉంది. ఈ విషయంలో చెన్నై ఘోర తప్పిదం చేసుకోని చెన్నై మూల్యం చెల్లించుకుంది.'అని మంజ్రేకర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ధోనీ అంటే భయమా?

ధోనీ అంటే భయమా?

అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ అభిమాని.. ధోనీపై కామెంట్ చేయాలంటే సంజయ్ మంజ్రేకర్ వణికిపోతున్నాడని, అతనే కాదు కామెంటేటర్లు అంతా అలానే వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ తప్పిదం చేస్తే.. అతని పేరును ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు. అదే ధోనీ చేసిన తప్పిదాన్ని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ మిస్టేక్‌గా పరిగణిస్తున్నారు. ఈ ట్రెండ్ రెగ్యూలర్‌గా కొనసాగుతున్నదే. సంజయ్ మంజ్రేకరే కాదు.. ఇతర కామెంటేటర్లు కూడా ధోనీని విమర్శించడానికి భయపడుతున్నారు'అని సదరు అభిమాని అసహనం వ్యక్తం చేశాడు.

నాకు భయమా..?

నాకు భయమా..?

ఇక ఈ అభిమాని ట్వీట్‌పై మంజ్రేకర్ స్పందించాడు. ధోనీ విమర్శించడానికి నాకే భయమని, ఒకసారి తన ట్విటర్ స్నేహితులను అడగాలన్నాడు. ‘సర్ నేను చెన్నై ఘోర తప్పిదం చేసిందన్నాను. అలా అంటే ధోనీ అన్నట్లు కాదా? ఇక అయ్యర్ గురించి చేసిన ట్వీట్‌లో నేను అతని బ్యాటింగ్ గురించి ప్రస్తావించాను. అప్పుడు డీసీ అని ఎలా అనగలను? ధోనీని విమర్శించడానికి నాకు భయమా? ఒక సారి నా ట్విటర్ ధోస్తులను అడుగు వారే సమాధానం చెబుతారు'అని మంజ్రేకర్ బదులిచ్చాడు.

IPL 2020 : Sanjay Manjrekar Calls Ambati Rayudu, Piyush Chawla 'Low Profile' Cricketers
జడేజా, భోగ్లేపై కామెంట్స్..

జడేజా, భోగ్లేపై కామెంట్స్..

ఇక సంజయ్ మంజ్రేకర్‌కు ఐపీఎల్ 2020 సీజన్‌ కామెంట్రీ ప్యానె‌ల్‌లో చోటు దక్కని విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, సహచర కామెంటేటర్ హర్షా భోగ్లే పట్ల మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతనిపై వేటు వేసింది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతూ మంజ్రేకర్ బీసీసీఐకి అనేక మెయిల్స్, లేఖలు రాసినా భారత క్రికెట్ బోర్డు కరుణించలేదు. బుద్దిగా బోర్డు నిబందనల మేరకు నడుచుకుంటానని విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఈ సీజన్‌కు మంజ్రేకర్ దూరమయ్యాడు.

పాంటింగ్‌తో పంత్ పరిహాసం.. డగౌట్‌లో నవ్వులే నవ్వులు!(వీడియో)

Story first published: Sunday, October 18, 2020, 17:01 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X