పాంటింగ్‌తో పంత్ పరిహాసం.. డగౌట్‌లో నవ్వులే నవ్వులు!(వీడియో)

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురేలేకుండా పోయింది. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్లు బాధ్యత తీసుకొని జట్టును గెలిపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరు ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ శిఖర్ ధావన్ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్(5 బంతుల్లో 3 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

అయితే కుర్రాళ్లతో కూడిన ఢిల్లీ సమష్టిగా చెలరేగుతూ వరుస విజయాలందుకోవడంలో కోచ్ రికీ పాంటింగ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అతని వ్యూహాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అతని పర్యవేక్షణలోని ఢిల్లీ.. పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టును తలపిస్తుంది.

పాంటింగ్‌తో పరిహాసం

అయితే పాంటింగ్ ఆటగాళ్లతో ఎంత చనువుగా ఉంటాడనే విషయం ఈ మ్యాచ్‌తో స్పష్టమైంది. ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా రికీ పాంటింగ్ డగౌట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే కామెంటేటర్లతో మాట్లాడుతుండగా.. పాంటింగ్ వెనుకాలే నిలుచున్న రిషభ్ పంత్ అతని మాటలను వింటూ తలూపుతూ ‘అచ్చా..'అన్నట్లు ఇమిటేట్ చేశాడు. పక్కనే ఉన్న స్టోయినిస్ కూడా కానివ్వూ అంటూ పంత్‌ను ప్రోత్సహించాడు. దాంతో తన వెనుకాల ఏదో జరుగుతుందని గ్రహించిన పాంటింగ్.. పంత్ వైపు తిరిగి చూడటంతో అతను ఏమి ఎరుగనట్టు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సరదా ఘటనతో అక్కడ నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

రివేంజ్ తీసుకుంటా..

ఇక ఈ ఘటనపై స్పందించిన పాంటింగ్.. ఏదో ఒక రోజు తనకు ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్‌ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుందని, అప్పుడు రీవెంజ్ తీసుకుంటానని సరదాగా కామెంట్ చేశాడు. ‘ఏదో ఒక రోజు నాకు ఢిల్లీ క్యాపిటల్స్, రిషభ్ పంత్, స్టోయినిస్‌ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు చెబుతా మీ సంగతి'అని పంత్ ట్వీట్ చేశాడు. ఇక పాంటింగ్ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. పంత్‌కు పూర్తిగా భయం లేకుండా పోయిందని, కొంచెం భయంలో పెట్టమని పంటర్‌కు సూచిస్తున్నారు.

 కోచ్ అంటే ఇలా ఉండాలి..

కోచ్ అంటే ఇలా ఉండాలి..

ఇక కోచ్ అంటే పాంటింగ్‌లా ఉండాలని, ఆటగాళ్లతో చనువుగా ఉంటేనే వారి సత్తా తెలుస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పాంటింగ్ కోచ్‌లకు ఓ కొత్త పాఠాన్ని నేర్పాడని కొనియాడుతున్నారు. ఇలాంటి కల్చర్ జట్టులో ఉంటే ఏ జట్టు ఓడిపోతుందని, అందుకే ఢిల్లీ వరుస విజయాలను అందుకుందని పాంటింగ్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక 9 మ్యాచ్‌ల్లో 7 గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్‌లో ఉన్న ఢిల్లీ తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

పంత్‌కు గాయం..

పంత్‌కు గాయం..

ఇక తొడ కండరాల గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల్లోనూ పంత్ ఆడలేదు. రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో కీపింగ్ చేస్తుండగా.. రిషబ్ పంత్‌ గాయపడ్డాడు. అయినప్పటికీ.. మ్యాచ్ చివరి వరకూ అసౌకర్యంగానే కీపింగ్ చేసిన పంత్‌కు కనీసం 7-10 రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో.. ముంబై ఇండియన్స్‌, రెండో సారి రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లకు ఈ వికెట్ కీపర్ దూరమయ్యాడు.

కష్టాల్లో ఉన్న ధోనీసేనకు గట్టి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 15:59 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X