న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉన్నాడు: సాక్షి

Sakshi reveals why MS Dhoni didn’t post anything on social media during coronavirus Lockdown


రాంచీ:
కరోనా పుణ్యమా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఊహించని విధంగా లభించిన ఈ విశ్రాంతిని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలోకాలక్షేపం చేశారు. ఇన్‌స్టాలైవ్ సెషన్స్ నిర్వహిస్తూ క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. తమ జీవితాలకు సంబంధించిన త్రోబ్యాక్ మూమెంట్స్‌ను పంచుకున్నారు. వ్యక్తిగత ఇష్టా అయిష్టాలు తెలిపారు.
 ధోనీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు..

ధోనీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు..

ఈ లాక్‌డౌన్ సమయంలో దాదాపు సెలెబ్రిటీలు చేసిన పనంతా ఇదే. కానీ టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం సోషల్ మీడియావైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతని గురించి దేశమంతా మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులతో తన ఫామ్ హౌస్‌లో హాయిగా గడిపాడు. పబ్‌జీ గేమ్ ఆడూతూ తనలోకంలోనే విహరించాడు. అయితే ధోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని తాజాగా అతని సతీమణి సాక్షి సింగ్ వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రజెంటర్ రూఫా రమణి నిర్వహించిన లైవ్ సెషన్‌లో పాల్గొన్న సాక్షి.. ధోనీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ప్రధాని సూచనలతోనే..

ప్రధాని సూచనలతోనే..

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ ఫాలో కావాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించడంతోనే ధోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడని సాక్షి తెలిపింది. ‘కరోనాపై వీడియోలు చేయాలని ధోనీపై చాలా ఒత్తిడి చేశారు. కానీ కరోనా నిబంధనలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నివ్వడంతో మహీ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. దేశంలో ప్రధానికి మించిన వారు ఎవరు లేరని భావించి సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడలేదు.'అని స్పష్టం చేసింది.

ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్.. కోహ్లీకి దక్కని కెప్టెన్సీ, బుమ్రాకు నో చాన్స్!

 గొడవపడేది నేనొక్కదాన్నే..

గొడవపడేది నేనొక్కదాన్నే..

ఇక మహీతో ఎవరూ గొడవ పడలేరని తాను ఒక్కదాన్ని మాత్రమే అతనితో వాదిస్తానని సాక్షి నవ్వుతూ చెప్పుకొచ్చింది. ‘నేను తప్పా ఎవరూ ధోనీతో గొడవ పడలేరు'అని చమత్కరించింది. వివిధ పర్యటనల్లో ధోనీ ఎప్పుడూ తన తలుపు తెరిచే ఉంటాడని, ఏ సమయంలోనైనా క్రికెటర్ల వచ్చి తనతో మాట్లాడే వెసులు బాటు కల్పిస్తాడని సాక్షి సింగ్ గుర్తు చేసుకుంది. ‘మహీ ఎప్పుడూ డోర్ తెరిచే ఉంచుతాడు. నా పెళ్లైనా తర్వాత కూడా. ఆటగాళ్లు మా గదిలోకి వచేవారు. మేమంతా ఉదయం 3-4 గంటల వరకు మాట్లాడుకునేవాళ్లం. క్రికెట్ గురించి ముచ్చటిస్తే మాత్రం నేను పక్కకు వెళ్లేదాన్ని.'అని సాక్షి తెలిపింది.

ధోనీ చాలా ఎమోషనల్..

ధోనీ చాలా ఎమోషనల్..

మైదానంలో భావోద్వేగాలను బయటపెట్టిన ధోనీ.. ఆట పట్ల చాలా ఎమోషనల్ అని సాక్షి చెప్పుకొచ్చింది. క్రికెట్ తన లవ్ అని పేర్కొంది. 2011 ప్రపంచకప్, 2018 ఐపీఎల్ ట్రోఫీ విజయం తర్వాత ధోనీ భావోద్వేగానికి గురయ్యాడని చెప్పింది. ‘క్రికెట్ పట్ల ధోనీ ఎప్పుడూ ఎమోషనల్‌గా ఉంటాడు. ఆటపై ధోనీకి అమితమైన ప్రేమ ఉంటుంది'అని సాక్షి తెలిపింది.ఇక గతేడాది జరిగిన ప్రపంచకప్ అనంతరం మళ్లీ మైదానంలో అడుగుపెట్టని ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా పుణ్యమా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త పేరు అలా రాస్తావ్?.. నెటిజన్‌పై క్రికెటర్ భార్య ఫైర్!

Story first published: Wednesday, June 3, 2020, 10:57 [IST]
Other articles published on Jun 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X