Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్.. కోహ్లీకి దక్కని కెప్టెన్సీ, బుమ్రాకు నో చాన్స్!

Aakash Chopra picks his current best ODI XI

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రస్తుత తరం ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ వన్డే జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారత ఆటగాళ్లకు అవకాశమిచ్చిన చోప్రా.. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల నుంచి ఇద్దరి చొప్పున తీసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ నుంచి ఒక్కొక్కరికి అవకాశమిచ్చాడు.

అయితే పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ల నుంచి మాత్రం ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కాకపోతే పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు 12వ ఆటగాడిగా అవకాశం ఇచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈతరం బెస్ట్ టీమ్‌ను ఈ కామెంటేటర్ సోమవారం వెల్లడించాడు.

ఓపెనర్లుగా రోహిత్..

ఓపెనర్లుగా రోహిత్..

ఈతరం అత్యుత్తమ జట్టు ఓపెనర్లుగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, వెస్టిండీస్ వికెట్ కీపర్ షై హోప్‌లకు అవకాశమిచ్చాడు. అయితే రోహిత్‌కు జోడీగా ఆసీస్ స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ అనుకున్నప్పటికీ.. వికెట్ కీపర్ కోసం షై హోప్‌ను తీసుకున్నాడు. ఇక మూడో స్థానంలో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి అవకాశమిచ్చిన చోప్రా.. నాలుగో స్థానంలో రాస్ టేలర్‌ను తీసుకున్నాడు. గత రేండేళ్లుగా టేలర్ అద్భుతంగా రాణిస్తున్నాడని వివరణ కూడా ఇచ్చాడు.

కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్..

కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్..

ఇక ఐదో స్థానంలో ఇయాన్ మోర్గాన్ తీసుకొని అతన్నే సారథిగా ఎంపిక చేశాడు. ఇయాన్ ఇంగ్లండ్ అభిమానులకు ఓ విభిన్నమైన క్రికెట్ చూపించాడని, అందుకే అతన్ని సారథిగా చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా అతను ఈ జట్టును ఉన్నత స్థాయిలో నిలబెడతాడని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్, కెప్టెన్సీ రెండింటిని సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా రాణించే సత్తా అతనికి ఉందని కొనియాడాడు.

బుమ్రాకు బదులు షమీ..

బుమ్రాకు బదులు షమీ..

ఇక ఆల్‌రౌండర్స్ కోటాలో 6,7 స్థానాల్లో షకీబ్ అల్ హసన్, బెన్ట స్టోక్స్‌లను తీసుకున్నాడు. వారి బౌలింగ్ గణంకాలు ఆకట్టుకోకపోయినా.. ఇద్దరు కలిసి కనీసం 10 ఓవర్లు వేస్తే చాలని తెలిపాడు. బౌలింగ్ విభాగంలో వరల్డ్ క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు బదులు ఆశ్చర్యకరంగా మహ్మద్ షమీకి అవకాశం ఇచ్చాడు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నాడు. మిగతా రెండు స్థానాలకు మిచెల్ స్టార్క్, ఫెర్గుసన్‌లను తీసుకున్నాడు.

విలియమ్సన్‌కు నో చాన్స్..

విలియమ్సన్‌కు నో చాన్స్..

గత రెండు ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల పడగొట్టడంతోనే స్టార్క్‌ను ఎంపిక చేసినట్లు చోప్రా చెప్పుకొచ్చాడు. ట్రెంట్ బౌల్ట్ కన్నా ఫెర్గూసన్ బౌలింగ్ గణంకాలు బాగున్నాయన్నాడు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వరల్డ్ బెస్ట్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాక్ బ్యాట్స్ ‌మన్ బాబర్ ఆజామ్‌, ఆసీస్ లెజెండ్ స్టీమ్ స్మిత్‌లకు ఈ బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో చోటు దక్కలేదు.

 ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్:

ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్:

రోహిత్ శర్మ, షై హోప్(కీపర్), విరాట్ కోహ్లీ, రాస్ టేలర్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఫెర్గూసన్, బాబర్ ఆజమ్

Story first published: Tuesday, June 2, 2020, 13:37 [IST]
Other articles published on Jun 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+