న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RSWS 2022: ఆనాటి ఆనందం ఈనాటిదే..! 1998నాటి సచిన్‌ను తలపించిన టెండూల్కర్..! అలాగే యువీ సైతం..!

Sachin Reminds his 1998 Performance During the Match Between India legends vs England legends

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా జరిగిన 14వ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్.. ఇంగ్లాండ్ లెజెండ్స్‌పై ఘన విజయాన్ని సాధించింది. సచిన్ టెండూల్కర్ (40పరుగులు 20బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) బ్యాటింగ్లో తన మాస్టర్ క్లాస్ చూపించగా.. రాజేష్ పవార్ 3వికెట్లు తీసి అదరగొట్టాడు.

తొలుత ఇండియా లెజెండ్స్ 5వికెట్లు కోల్పోయి 175పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 6వికెట్లు కోల్పోయి 130పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇండియా లెజెండ్స్ 40పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో స్టీఫెన్ ప్యారీ 3వికెట్లు తీసి కాస్త మంచి ప్రదర్శన కనబరిచాడు.

యువీ, పఠాన్ దంచికొట్టడంతో..

ఈ మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లాండ్ లెజెండ్స్ టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్లు నమన్ ఓజా, సచిన్ టెండూల్కర్ ఇద్దరు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. ఆరో ఓవర్లో నమన్ ఓజా (20) ఔటయ్యేసరికి స్కోరు 65కు చేరుకుంది. ఇక సచిన్ సైతం 2పరుగుల వ్యవధిలోనే ఔటయ్యాడు. ఇక రైనా (12) తొందరగొనే ఔటయినా.. యూసుఫ్ పఠాన్ (11బంతుల్లో 27పరుగులు 1ఫోర్, 3సిక్సర్లు), యువరాజ్ సింగ్ (15బంతుల్లో 31పరుగులు 1ఫోర్, 3సిక్సులు నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (18), ఇర్ఫాన్ పఠాన్ (11) దంచికొట్టడంతో స్కోరు బోర్డు 195కు చేరుకుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 15ఓవర్లకు కుదించారు. 15ఓవర్లలోనే భారత్ 170పరుగులు చేయడం గమనార్హం.

బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లాండ్ లెజెండ్స్

ఛేదనలో ఇంగ్లాండ్ లెజెండ్స్ ఓపెనర్లు ఫిల్ మస్టర్డ్, డిమిత్రి మస్కరెన్హాస్ పవర్‌ప్లేలో కాస్త ధాటిగా ఆడడంతో శుభారంభం దక్కింది. మస్టర్డ్ (19 బంతుల్లో 29 పరుగులు) రాణించాడు. అయితే 36పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇయాన్ బెల్, రిక్కీ క్లార్క్, టిమ్ ఆంబ్రోస్ లాంటి దిగ్గజాలు తమ అంచనాలను అందుకోలేక పోవడంతో 85పరుగులకే 6వికెట్లు కోల్పోయింది. చివర్లో స్కోఫీల్డ్ 19పరుగులు, ట్రెమ్‌లెట్ 24పరుగులు పర్వాలేదనిపించేలా ఆడి స్టేడియంలోని అభిమానులకు కొంత వినోదాన్ని అందించింది. చివరికి 40 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్‌కు ఘన విజయం దక్కింది. భారత బౌలర్లలో రాజేష్ పవర్ 3, మన్ ప్రీత్ గోనీ 1, బిన్నీ 1, ప్రగ్నాన్ ఓజా 1 వికెట్ తీశారు.

గతాన్ని గుర్తుకుతెచ్చిన యువీ, సచిన్

ఇక ఈ మ్యాచ్ చూసినవారిని అలనాటి సచిన్ గుర్తుకొచ్చే ఉంటాడు. 1998లో ఆసీస్ మీద ఓ మ్యాచ్‌లో సచిన్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్.. మళ్లీ నిన్నటి మ్యాచ్‌లో సచిన్ కొట్టాడు. మూడు వైవిధ్యమైన సిక్సులు, ప్లేస్ మెంట్ ఫోర్లు చూస్తే.. సగటు సచిన్ అభిమాని ఎంత పులకించిపోయి ఉంటాడో చెప్పలేం. ఇక మరో పక్క యువీ కూడా తన భీకర స్ట్రోక్ చూపించాడు. యువీ కొట్టిన తొలి సిక్స్.. ఒకప్పటి యువరాజ్‌ను గుర్తుకుతెచ్చింది. ఇక మరో రెండు సిక్సులు కూడా అదిరిపోయాయి. అలాగే యూసుఫ్ పఠాన్ కూడా తన హిట్ ప్యాక్డ్ ఇన్నింగ్స్ చూపించాడు. అతను కూడా మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ చూడలేకపోయామని బాదపడొద్దు. హైలెట్స్ వూట్ (VOOT) యాప్‌లో చూడండి.

Story first published: Friday, September 23, 2022, 11:42 [IST]
Other articles published on Sep 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X