For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అందాలను ఆస్వాదించాలి: సచిన్ టెండూల్కర్

జీవితంలో ఒక్కసారైనా జమ్మూ కశ్మీర్ పర్యటించాలని ఈ ప్రపంచానికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించారు. ఇటీవల కుటుంబంతో కలిసి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన సచిన్ టెండూల్కర్.. అక్కడి వాతావరణం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా భారత్‌లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, కశ్మీర్ పర్యటన తర్వాత తనకు ఈ విషయం అర్ధమైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Sachin Tendulkar invites the World Come and experience Jammu and Kashmir

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలితో కలిసి కశ్మీర్‌ వెకేషన్‌‌కు వెళ్లారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కశ్మీర్‌లో తన సతీమణి అంజలితో కలిసి సచిన్ మంచుతో ఆటలు ఆడారు. ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్న సచిన్.. జీవితంలో ఒక్కసారైనా కశ్మీర్ అందాలను ఆస్వాదించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.

'నా జీవితంలో జమ్మూ కశ్మీర్ పర్యటన ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. చుట్టూ మంచు ఉన్నా... అక్కడి ప్రజల అసాధారణమైన ఆతిథ్యం మాకు వెచ్చదనాన్ని ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ పర్యటన తర్వాత ఈ విషయం నాకు బాగా తెలిసొచ్చింది.

మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్‌కు కశ్మీర్ విల్లో బ్యాట్లు ఉదాహరణలు. ఈ ప్రపంచాన్ని, భారత్ ప్రజలను నేను కోరేది ఒక్కటే. భారత దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రదేశమైన జమ్మూ కశ్మీర్‌లో పర్యటించండి. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి అందాలను ఆస్వాదించండి.'అని సచిన్ పిలుపునిచ్చారు. ఈ పోస్ట్‌కు తన పర్యటనకు సంబంధించిన వీడియోను జత చేశారు.

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్‌తో సచిన్ టెండూల్కర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ముంబై ఇండియన్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

Story first published: Wednesday, February 28, 2024, 15:55 [IST]
Other articles published on Feb 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+