ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ పేస్ ఆల్‌రౌండర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సమాయత్తం అవుతున్నాడు. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన అర్జున్.. అక్క సారా టెండూల్కర్‌తో కలిసి జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో సారా టెండూల్కర్ జిమ్‌లోని అద్దం ముందు ఫోన్‌తో ఫోటో తీస్తుండగా.. ఆమె వెనుకాల అర్జున్ సీరియస్‌గా ఫోజిచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌కు ఎంపికైన అర్జున్ టెండూల్కర్.. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. సచిన్‌పై ఉన్న గౌరవంతో ముంబై ఇండియన్స్ ప్రతీ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ను రిటైన్ చేసుకుంటుంది. 2021లోనే జట్టులో చేరినా.. అతని ఐపీఎల్ అరంగేట్రం గత సీజన్‌లో జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్రం చేశాడు.
తొలి మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతను 9.36 ఎకానమీతో మూడు వికెట్లు తీసాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలోనూ అర్జున్ టెండూల్కర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు మాత్రమే తీసాడు.
బ్యాటింగ్‌లో మాత్రం రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 23.45 సగటుతో 258 రన్స్ చేశాడు. గోవా చివరి లీగ్ మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో గోవా 7 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడి మరో మ్యాచ్ డ్రా చేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్ ముంబై ఇండియన్స్ మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను నడిపించనున్నాడు. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్‌ను శుభ్‌మన్ గిల్ నడిపించనున్నాడు.