For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH ఓటమికి కారణం అతడే- సచిన్

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఎస్‌ఆర్‌హెచ్-కేకేఆర్ మ్యాచ్‌ను ఆస్వాదించింనట్లు తెలిపాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రసెల్ (64; 25 బంతుల్లో) మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. సాల్ట్ (54; 40 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. రింకూ సింగ్ (23; 15 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు.

IPL 2024 Harshit Rana courageous bowling was the reason for Sunrisers Hyderabad defeat- Sachin Tendulkar

అయితే ఓ దశలో కోల్‌కతా 14 ఓవర్లకు 119/6 స్కోరు మాత్రమే సాధించింది. కానీ ఆ తర్వాత రసెల్ తన ఊచకోతతో ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (63; 29 బంతుల్లో) గొప్ప పోరాటం వృథాగా మారింది.జోరు మీదున్న క్లాసెన్‌ను ఆఖరి ఓవర్‌లో హర్షిత్ రాణా ఔట్ చేసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు.

క్లాసెన్ ఊహకు అందకుండా యార్కర్‌కు బదులుగా హర్షిత్ స్లో డెలివరీని సంధించి సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడని సచిన్ తెలిపాడు. ''రసెల్, క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్‌కు మనం సాక్ష్యులుగా నిలిచాం. తొలుత సాల్ట్ ఛార్జ్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత రసెల్ గొప్ప పవర్ హిట్టింగ్ చేశాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయతీరాలకు దగ్గరగా చేర్చాడు. కానీ హర్షిత్ రాణా ఆఖరి ఓవర్‌లో సాహసోపేతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కుదురుకున్న క్లాసెన్‌కు, ఆ దశలో యార్కర్‌కు బదులుగా స్లో బంతిని విసిరాడు. ఇది క్లాసెన్‌కు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు'' అని సచిన్ ట్వీట్ చేశాడు.

చివరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు 13 పరుగులు అవసరమవ్వగా తొలి బంతిని క్లాసెన్ సిక్సర్ బాదాడు. కానీ ఆ తర్వాతి అయిదు బంతుల్లో హర్షిత్ రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

Story first published: Sunday, March 24, 2024, 12:08 [IST]
Other articles published on Mar 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+