న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు గంగూలీనే గొడవకు దిగాడు: శ్రీలంక మాజీ క్రికెటర్

Russel Arnold recalls his heated argument with Sourav Ganguly from 2002 Champions Trophy Final

చెన్నై: కరోనా కారణంగా స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఎన్నడూ ఊహించని విధంగా దొరికిన ఈ విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్రోబ్యాక్ మూమెంట్స్‌ను నెమరువేసుకుంటున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ 2002 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ‌తో చోటుచేసుకున్న వాగ్వాదాన్ని గుర్తు చేసుకున్నాడు. సోమవారం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మీడియానే పెద్దది చేసింది..

మీడియానే పెద్దది చేసింది..

2002 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీ జరిగిందే చిన్న వాగ్వాదమని, కానీ మీడియా చాలా సీన్ క్రియేట్ చేసిందన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో లేట్ కట్ ఆడిన తాను పిచ్‌పై పరుగు తీసానని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేసిన గంగూలీ తనతో వాగ్వాదానికి దిగాడని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ కూడా పిచ్‌ మీద ఉన్న ప్రమాదకర ఏరియాలో పరుగు తీయవద్దని సూచించాడని గుర్తు చేసుకున్నాడు.

2-3 అడుగులే వేసా..

2-3 అడుగులే వేసా..

‘అది 2002 చాంపియన్స్ ట్రోఫీ అనుకుంటా. శ్రీలంకలో ఆడుతున్నాం. మా జట్టు స్కోర్ 200 పరుగులున్నప్పుడు అనుకుంటా.. నేను ఓ లేట్ కట్ షాట్ ఆడి పరుగు తీసినట్టు గుర్తుంది. ఈ క్రమంలో పిచ్‌పై 2-3 అడుగులు వేశాను. ఇది జరిగి ఇప్పటికే 18 ఏళ్లు అయింది. నిజాయితీగా చెబుతున్నా.. నేను కేవలం 2-3 అడుగులు ముందుకు వేసాను. అందరూ చూశారు. సౌరవ్ గంగూలీ నా దగ్గరకు వచ్చి అరిచాడు.

సౌరవ్ దూకుడుగా ఉంటాడు..

సౌరవ్ దూకుడుగా ఉంటాడు..

అంతకు మించి అక్కడేం జరగలేదు. రాహుల్ ద్రవిడ్ ‘రస్.. పిచ్‌ డేంజర్ ఏరియాలో పరుగెత్తకు'అని చెప్పాడు. అది ఓ చిన్న వాగ్వాదం మాత్రమే. సౌరవ్‌తో ఆడుతున్నప్పుడు.. అతను దూకుడుగా ఉంటాడు. అతని సాయశక్తులా పోరాడుతాడు. మాటకు మాట బదులిస్తాడు. అలాగే అతన్ని ప్రశాంత పరచడం కూడా సులువే. అప్పుడు మా మధ్య జరిగింది వాగ్వాదమే. అంతకు మించేంలేదు. ఇదంతా ఆటలో భాగమే. క్రీడా స్పూర్తి ప్రకారం నడుచుకుందే. కానీ మీడియా దాన్ని భూతద్దంలో చూపించింది.'అని ఆర్నాల్డ్ గుర్తు చేసుకున్నాడు.

ట్రోఫీని పంచుకున్న ఇరు జట్లు..

ట్రోఫీని పంచుకున్న ఇరు జట్లు..

కొలంబో వేదికగా జరిగిన నాటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వర్షం అంతరాయం కలిగించడంతో టైటిల్‌ను శ్రీలంక, భారత్ సంయుక్తంగా పంచుకున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రస్సెల్ ఆర్నాల్డ్(56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. వర్షం అంతరాయం కలిగించే సమయానికి 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేసి.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ఈ సారి రాములో రాములాతో దుమ్ములేపిన వార్నర్!

Story first published: Tuesday, May 12, 2020, 19:43 [IST]
Other articles published on May 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X