ఈ సారి రాములో రాములాతో దుమ్ములేపిన వార్నర్!

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో దుమ్ములేపుతున్నాడు. అచ్చం తన బ్యాటింగ్ మాదిరే ఇరగదీస్తున్నాడు. కూతురి కోరిక మేరకు టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఈ డాషింగ్ ప్లేయర్.. దాని గురించి ఏం తెలియదంటూనే వరుస వీడియోలతో కుమ్మేస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో తెలుగు అభిమానులను అలరించిన ఈ సన్ రైజర్స్ కెప్టెన్.. ఈ సారి తెలుగు సాంగ్స్, డైలాగ్స్‌తో టిక్‌టాక్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
మొత్తానికి ఈ క్వారంటైన్ సమయాన్ని తనకు కావాల్సిన రీతీలో ఆస్వాదిస్తూ.. ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందిస్తున్నాడు. మొన్న తెలుగు సూపర్ హిట్ బుట్ట బొమ్మ పాటకు చిందేసిన వార్నర్.. ఆ తర్వాత సన్నజాజి, మహేశ్ బాబు డైలాగ్‌తో అదరగొట్టాడు. తాజాగా తెలుగు సూపర్ హిట్ సాంగ్ 'రాములో రాములా'కు ఫ్యామిలీతో కలిసి చిందేసాడు.

అల్లు అర్జున్ మాదిరే..
బుట్ట బొమ్మ, సన్నజాజి సాంగ్ తరహాలోనే తన భార్య క్యాండీస్, కూతురి ఇండిరేతో కలిసి ఈ సూపర్‌సాంగ్‌కు టిక్‌టాక్ చేశాడు. ముందు వరుసలో వార్నర్-కాండీస్‌లు జంటగా అచ్చం అల్లు అర్జున్ మాదిరి స్టెప్పులేయగా... వెనుకాల ఇండిరే ఇరగదీసింది. అయితే ఈ సాంగ్‌కు తగ్గట్లు ఈ ముగ్గురు కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం. క్యాప్ పెట్టుకున్న వార్నర్ ఈ టిక్‌టాక్ చివర్లో బన్నీ స్టైల్లో దాన్ని తీయడం గమనార్హం.
బుట్ట బొమ్మ సాంగ్‌కు వార్నర్ చేసిన టిక్‌టాక్‌ను అల్లు అర్జున్ మెచ్చుకోగా.. సూపర్ సాంగ్ అంటూ సన్‌రైజర్స్ కెప్టెన్ బదులిచ్చాడు.

అల్లు అర్జున్ సాంగ్స్ గుత్త పట్టాడా?
అయితే వార్నర్ టిక్‌టాక్‌తో అతని ఫ్యాన్స్‌తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. కొందరైతే వార్నర్ అల్లు అర్జున్ సాంగ్స్ గుత్తపట్టాడా? ఏందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరిన్నీ వీడియోలతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఐపీఎల్ లేకున్నా నీ ఎంటర్‌టైన్ మిస్సవ్వలేదు వార్నర్.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
మహేష్ బాబు పోకిరి డైలాగ్ చెప్పి ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ చేత ప్రశంసలు అందుకున్న వార్నర్.. సినిమా ఆఫర్ కూడా అందుకున్నాడు. వార్నర్‌కు నటించాలని ఉంటే తన మూవీలో అవకాశమిస్తానని పూరిజగన్నాథ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను కూడా ఈ ఆసీస్ ప్లేయర్ సంతోషపరిచాడు.

అలవైకుంఠపురం టీమ్ ఫుల్ ఖుషీ..
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అలవైకుంఠపురం మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసింది. ఈ సినిమాకు ఎస్‌ఎస్ తమన్ అందించిన సంగీతం సూపర్ హిట్ కావడంతో విడుదలకు ముందే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం సంక్రాంతి బరిలో అద్భుత విజయాన్నందుకుంది. ఇక తమ మూవీ సూపర్ హిట్ సాంగ్స్‌కు దిగ్గజ క్రికెటర్ వార్నర్ టిక్ టాక్ చేయడంతో ఆ చిత్ర యూనిట్ తెగసంతోషం వ్యక్తం చేస్తుంది. బుట్టబొమ్మా సాంగ్‌కు ముగ్ధులైన అల్లు అర్జున్, తమన్ ఇప్పటికే ట్విటర్ వేదికగా వార్నర్‌ను కొనియాడారు.

వార్నర్‌ను మెచ్చుకున్న రోహిత్ ..
అలవైకుంఠపురంలోని బుట్టబొమ్మా సాంగ్ గురించి వరల్డ్ బెస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముచ్చటించుకున్నారు . ఈ సందర్భంగా ‘నీ బుట్ట బొమ్మ సాంగ్ డాన్స్ అదిరిపోయింది వార్నర్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది'అని వార్నర్‌ను రోహిత్ శర్మ కొనియాడాడు. అది టాలీవుడ్ పాట కదా అని కూడా అడిగాడు. అయితే టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయడం చాలా కష్టమని తెలిపిన వార్నర్.. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని అక్కడి అభిమానులు ఎంతో చురుగ్గా ఉంటారని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
మరో ఐదారేళ్లలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్తా: రోహిత్ శర్మ