న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా కార్తీక్‌ను కాదని ముంబై కెప్టెన్సీ నన్ను వరించింది: రోహిత్

 Rohit Sharma reveals how he got Mumbai Indians captaincy
Rohit Sharma Dominate Dinesh Karthik For Mumbai Indians Captaincy

ముంబై: ఐపీఎల్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టు సారథ్య బాధ్యతలు మ్యూజికల్ ఛైర్ ఆటను తలపించాయి. 2013 వరకు తరుచూ ఆ ఫ్రాంచైజీ కెప్టెన్లను మార్చింది. ప్రారంభంలో సచిన్ టెండూల్కర్ జట్టును నడిపించగా.. ఆ తర్వాత హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్, షాన్ పొలాక్, డ్వాన్ బ్రావో కెప్టెన్లుగా వ్యవహరించారు. కానీ 2013 సీజన్ మధ్యలో పాంటింగ్ నుంచి జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ అందుకోవడంతో ఆ టీమ్ స్వరూపమే మారిపోయింది. ఆ సీజన్‌లోనే ముంబై తన తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలా ఇప్పటి వరకు(2013, 2015, 2017, 2019) నాలుగు టైటిళ్లు అందుకొని ఐపీఎల్‌లోనే తిరుగులేని జట్టుగా చరిత్ర సృష్టించింది.

కెప్టెన్ అవుతానని ముందే అనుకున్నా..

కెప్టెన్ అవుతానని ముందే అనుకున్నా..

అయితే తనకు ముంబై జట్టు బాధ్యతలు ఎలా వచ్చాయో రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ.. సారథ్యం విషయంలో దినేశ్ కార్తీక్‌‌తో కొంత పోటీ ఎదురైందని గుర్తు చేసుకున్నాడు. ‘అప్పటి వరకు డెక్కెన్ చార్జెస్‌కు ఆడిన నేను.. ముంబై జట్టులోకి రాగానే కెప్టెన్ అవుతానని ఊహించాను. అవకాశం ఎప్పుడూ వచ్చిన తనదైన మార్క్ కెప్టెన్సీ చూపించేందుకు సిద్దంగా ఉన్నా. 2013 వేలానికి ముందు హర్భజన్ సింగ్ జట్టును నడిపించలేడని సచిన్ పా నాతో అన్నాడు. అప్పడు భజ్జీపాను కెప్టెన్ ఎందుకు చేయలేదో నాకు తెలియదు.

పాంటింగ్‌తో పోటీ పడలేననిపించింది. అప్పుడు నాకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుందని భావించా. కానీ 2013 వేలంలో రికీ పాంటింగ్ తీసుకోవడంతో అతనితో కెప్టెన్సీ రేసులో పోటీపడలేనని అనిపించింది. ఆ సీజన్‌లో అందరికన్నా ముందే భారత్‌కు వచ్చిన పాంటింగ్ ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. టీమ్ బాండింగ్ సెషన్ నిర్వహించాలని ఫ్రాంచైజీ అడిగాడు. ప్రతీ ఒక్కరిలో ఓ సానుకూల దృక్పథం వచ్చేలా చేశాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లలో స్పూర్తి నింపాడు.

 దినేశ్ కార్తీక్ పేరు సూచించినా..

దినేశ్ కార్తీక్ పేరు సూచించినా..

అయితే తన వ్యక్తిగత ప్రదర్శన బాలేదని సీజన్ మధ్యలో తన సారథ్య బాధ్యతలు వదులుకున్నాడు. అప్పడు కొంతమంది దినేశ్ కార్తీక్ పేరు సూచించారు. కానీ పాంటింగ్ మాత్రం నన్ను పిలిచి నువ్వు ముందుండి కెప్టెన్‌గా జట్టు నడిపించాలన్నాడు. అలా నేను కెప్టెన్ అయ్యా. ఆ సీజన్‌లో పాంటింగ్ ప్లేయర్ కమ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతను నాకెంతో సాయం చేశాడు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

9 గంటలు నిద్ర పక్కా..

9 గంటలు నిద్ర పక్కా..

తాను కనీసం 9 నుంచి 10 గంటలు నిద్రపోతానని చెప్పుకొచ్చిన హిట్ మ్యాన్.. తన కూతురు సమైరా కారణంగా ఇటీవల కాస్త నిద్రపోవడం తగ్గించానని తెలిపాడు. ‘అశ్విన్ ఇది నువ్వు నమ్మవు.. కానీ నిజం. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో నేను ఒక్కసారి కూడా బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్దకు వెళ్లలేకపోయాను. టోర్నీలో మ్యాచ్‌లు ముగిసేసరికి అర్ధరాత్రి అవుతుంది.. ఇది ఒక కారణమైతే.. మరొక కారణం నేను కనీసం 9-10 గంటలు తప్పనిసరిగా నిద్రపోతా. కానీ.. సమైరా పుట్టిన తర్వాత తనతో కలిసే నిద్రపోతున్నా.. ఆమెతో పాటే నిద్రలేస్తున్నా. సమైరా మెళకువగా ఉన్న సమయంలో నిద్రపోవడం సాధ్యం కావడం లేదు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

టికెట్ తీసుకోకుండా కండక్టర్‌కు అలా చెప్పి అడ్డంగా బుక్కయ్యా: కోహ్లీ

Story first published: Tuesday, May 19, 2020, 13:23 [IST]
Other articles published on May 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X