టికెట్ తీసుకోకుండా కండక్టర్‌కు అలా చెప్పి అడ్డంగా బుక్కయ్యా: కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రీడాకారుడు. కోట్ల సంపదతో తరగని ఆస్తి అతని సొంతం. విలాసవంతమైన జీవితం. ఇదంతా ఇప్పుడు. కానీ ఒకప్పుడు కోహ్లీ ఓ సాధారణ మధ్యతరగతి జీవి. న్యాయవాది అయిన తన తండ్రి పోషణ మీదనే జీవించేవాడు. ప్రాక్టీస్‌కు తన తండ్రి స్కూటర్ మీద లేకుంటే అకాడమీ పాస్‌తో డీటీసీ బస్సుల్లో ప్రయాణించేవాడు. అయితే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఓసారి కండక్టర్‌కు అబద్దం చెప్పి దొరికిపోయినట్లు విరాట్ గుర్తు చేసుకున్నాడు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఢిల్లీలో పెరిగిన కాలాన్ని, బస్సుల్లో ప్రయాణించిన రోజులను గుర్తు చేసుకున్నారు.

బస్సుతోనే నా ప్రయాణం మొదలు..
తన ప్రయాణం బస్సులతో మొదలైందని విరాట్ తెలిపాడు. ‘బస్సులతోనే నా ప్రయాణం మొదలైంది. నా దగ్గర అకాడమీ బస్ పాస్ ఉండేది. అలాగే వెనుక క్యారియర్‌తో ఉన్న సైకిల్ కూడా ఉండేది. ఆ తరువాత రెండు బ్యాట్‌లను పెట్టుకునేలా ఉండే డఫుల్ బ్యాగ్ కొన్నాను. కానీ కొన్ని మ్యాచ్‌లకు మా నాన్నే నన్ను డ్రాప్ చేసేవాడు. ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో నేను మ్యాచ్‌లు ఆడుతుంటే.. మానాన్న హై కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేసేవారు.'అని కోహ్లీ తెలిపాడు.

టికెట్ లేకుండా..
ఇక టికెట్ లేకుండా ఏ రోజైనా బస్సులో ప్రయాణించావా?అని సునీల్ ఛెత్రీ కోహ్లీని ప్రశ్నించగా.. ఎన్నడు అలాంటి పనులు చేయలేదని విరాట్ సమాధానమిచ్చాడు. కానీ ఒక సారి స్టాఫ్ మెంబర్ అని కండక్టర్‌కు అబద్దం చెప్పి దొరికిపోయానని గుర్తు చేసుకున్నాడు. ‘ఎన్నడు అలాంటి పనులు చేయలేదు. నా ముఖం చూసి నేను చెప్పేది ఎవరూ సీరియస్ తీసుకునేవారు కాదు. ఓసారి కండక్టర్‌కు స్టాఫ్ మెంబర్ అని చెప్పి దొరికి పోయా. స్టాప్ మెంబర్స్‌కు ప్రత్యేక ప ర్సనాలిటీ ఉంటుంది. దాన్ని మనం అనుసరించలేం. కండక్టర్‌కు స్టాఫ్ మెంబర్ అని చెప్పగానే నాపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వెంటనే భయంతో బస్సు దిగిపోయాను. అప్పటి నుంచి ఏ రోజు టికేట్ లేకుండా ప్రయాణించలేదు. కానీ కొంతమంది పిల్లలు చాలా కాన్ఫిడెన్స్‌తో టికెట్ లేకుండా ప్రయాణించేవారు.'అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

టికెట్ లేకుండానే ప్రయాణించేవాడిని..
ఇక ఫుట్‌బాల్ కెప్టెన్ ఛెత్రీ మాట్లాడుతూ.. తాను టికెట్ లేకుండా ప్రయాణించేవాడినన్నాడు. ‘నేను తరుచుగా టికెట్ లేకుండా డీటీసీ బస్సులో ప్రయాణం చేసేవాడిని. అప్పుడు ఫైన్ రూ.20 ఉండేది. నా పాకెట్ మనీ కూడా అంతే. దీంతో ఒకవేళ దొరికితే ఫైన్ కడదాంలే అనే ధీమాతో టికెట్ తీసుకుపోయేవాడిని. కొన్ని సార్లు అలా ఫైన్ కూడా కట్టా. కానీ ఆ తరువాత ఫైన్‌ను రూ. 50 పెంచారు. దాంతో టికెట్ తీసుకోలేక తప్పలేదు.'అని ఛెత్రీ చెప్పుకొచ్చాడు.
అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications