న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో ఐదారేళ్లలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్తా: రోహిత్ శర్మ

Rohit Sharma hints his career will end at the age of 38 or 39

ముంబై: కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దవ్వడంతో స్టార్ క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎన్నడూ దొరకని ఇంతటి విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. సహచర ఆటగాళ్లతో కలిసి ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే చాలా మంది ప్లేయర్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహించాడు. క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

వార్నర్‌తో ఇన్‌స్టా లైవ్..

వార్నర్‌తో ఇన్‌స్టా లైవ్..

తాజాగా ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో హిట్‌మ్యాన్ శుక్రవారం సాయంత్రం ఇన్‌స్టా లైవ్ సెషన్‌ నిర్వహించాడు. ఈ లైవ్ చిట్‌చాట్‌లో అనేక విషయాలపై చర్చించిన ఈ ఇద్దరూ.. రిటైర్మెంట్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. తాను మరో ఐదారేళ్లలో ఆటకు గుడ్‌బై చెప్తానన్నాడు. జీవితంలో ఫ్యామిలీ చాలా ముఖ్యమని నొక్కి చెప్పిన ఈ 34 ఏళ్ల క్రికెటర్.. 38 లేక 39 ఏళ్ల వయసులో అంటే 2025 లేక 2026లో రిటైర్మెంట్ తీసుకుంటానన్నాడు. బిజీ షెడ్యూల్, విదేశీ పర్యటనల వల్ల క్రికెటర్లంతా తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు.

ఆసీస్‌తో ఆడటం చాలా ఇష్టం..

ఆసీస్‌తో ఆడటం చాలా ఇష్టం..

ఇక ఆస్ట్రేలియాపై ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని ఈ వైట్‌బాల్ వైస్ కెప్టెన్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై దక్కిన సిరీస్ విజయం తనకెంతో ప్రత్యేకమైనదన్నాడు. ఇక ఆసీస్ గడ్డపై కోహ్లీసేన గెలిచిన వన్డే, టెస్ట్ సిరీస్‌ రెండింట్లో రోహిత్ ఉన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ కూడా భారత్‌పై ఆ డటమంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాపై రోహిత్‌కు కూడా మంచి రికార్డే ఉంది. ఆ జట్టులో 40 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్ మ్యాన్ 2208 పరుగులు చేశాడు.

ఇక ఈ ఏడాది చివర్లో భారత్.. ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నా.. ఇరు జట్ల బోర్డులు సిరీస్ నిర్వహణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. ఇప్పటికే భారత ఆటగాళ్లను 14 రోజుల క్వారంటై‌న్‌లో ఉంచేందుకు సిద్దమేనని బీసీసీఐ ప్రకటించింది.

ధావన్ ఓ ఇడియట్..

ధావన్ ఓ ఇడియట్..

తన సహచర ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ ఇడియట్ అని రోహిత్ శర్మ అన్నాడు. తొలి బంతిని ఎదుర్కోవడానికి ధావన్ ఇష్టపడడని తెలిపాడు. ‘ధావన్‌‌ ఓ మూర్ఖుడు. తొలి బంతిని ఎదుర్కోవడానికి ఏమాత్రం ఇష్టపడడు. స్పిన్‌‌ బౌలింగ్‌‌ ఆడేందుకు ఇష్టపడతాడు కానీ అటాక్‌‌ చేయడు. 2013 చాంపియన్స్‌‌ ట్రోఫీలో నేను ఫస్ట్‌‌ టైమ్‌‌ ఓపెనర్‌‌గా వచ్చా. నేనిప్పటి దాకా కొత్త బాల్‌‌ ఫేస్‌‌ చెయ్యలేదు, స్ట్రయిక్‌‌ తీసుకో అని శిఖర్‌‌కు చెప్పా. నువ్వు చాలా కాలంగా ఆడుతున్నావు.. నాకిదే ఫస్ట్‌‌ టూర్‌. నువ్వే స్ట్రయిక్‌‌ తీసుకో అని శిఖర్‌‌ నాకు చెప్పాడు.

అంటే రెగ్యులర్‌‌ ఓపెనర్‌‌ అయిన మనిషికి స్ట్రయిక్‌‌ తీసుకోవడం ఇష్టం లేదనేగా. దాంతో నేనే స్ట్రయిక్​ తీసుకున్నా. మోర్నీ మోర్కెల్ వేసిన తొలి మూడు బంతులను కనీసం చూడలేకపోయా. బంతి బౌన్స్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదే ధావన్‌తో నాకున్న తొలి అనుభవం. ప్రస్తుతం అతనితో చాలా కంఫర్టబుల్​గా ఉన్నా. 'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

Story first published: Saturday, May 9, 2020, 17:37 [IST]
Other articles published on May 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X