Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs IND: గులాబీ ముల్లు గుచ్చింది మనకే... ఓటమి ముంగిట భారత్!

AUS vs IND: ఆస్ట్రేలియాతో ఏకైక పింక్ బాల్(డే/నైట్) టెస్ట్‌లో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో చెత్తులెత్తేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు ఓటమికి చేరువైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 6 వికెట్లకు 105 పరుగులు చేసింది. క్రీజులో ప్రతికా రావల్(84 బంతుల్లో 6 ఫోర్లతో 43)తో పాటు స్నేహ్ రాణా(4) ఉంది. ప్రస్తుతం భారత్ 20 పరుగుల వెనుకంజలో ఉంది.

ఆస్ట్రేలియా బౌలర్లలో హమిల్టన్(3/32) మూడు వికెట్లతో.. అన్నబెల్ సదర్లాండ్(2/15) రెండు వికెట్లతో భారత్ పతనాన్ని శాసిచింది. బ్రౌన్‌కు ఒక వికెట్ దక్కింది. మూడో రోజు ఆట తొలి సెషన్‌లో ఈ మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది. చివరి నాలుగు వికెట్లను ఎంత త్వరగా తీస్తే ఆసీస్‌‌ విజయలాంఛనం అంత వేగంగా పూర్తవుతుంది.

అంతకుముందు 96/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90.4 ఓవర్లలో 323 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. అన్నబెల్ సదర్లాండ్(171 బంతుల్లో 17 ఫోర్లతో 129) సెంచరీతో రాణించగా.. ఎల్లిస్ పెర్రీ(116బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. భారత బౌలర్లలో సయాలి సత్ఘరే(4/50) నాలుగు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్(2/72), దీప్తి శర్మ(2/67) రెండేసి వికెట్లు తీసాడు. స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ చెరో వికెట్ తీసారు.

అనంతరం 125 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్మృతి మంధాన(2), షెఫాలీ వర్మ(5), జెమీమా రోడ్రిగ్స్(14), హర్మన్ ప్రీత్ కౌర్(11), రిచా ఘోష్ తీవ్రంగా నిరాశపర్చడంతో 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

స్నేహ్ రాణా సాయంతో ఒంటరి పోరాటం చేసిన ప్రతికా రావల్.. జట్టు స్కోర్‌ను 100 పరుగుల మార్క్‌ను ధాటించింది. లేదంటే టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలయ్యేది. దాదాపు 20 నెలల తర్వాత భారత మహిళల జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతుండటం.. అందులో పింక్‌బాల్‌తో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడంతో ఆసీస్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. స్వింగ్ అయిన పింక్ బాల్‌కు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.

Story first published: Saturday, March 7, 2026, 22:24 [IST]
Other articles published on Mar 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+