Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్ ఔట్.. రోహిత్ హాఫ్ సెంచరీ

India Vs Australia,3rd ODI : It's Rohit Sharma & Virat Kohli Show All The Way! | Oneindia Telugu
 Rohit Sharma 50 drives India after KL Rahul exit

బెంగళూరు : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డిసైడర్ వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(19) ఔటయ్యాడు. శిఖర్ ధావన్ గాయంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. అగర్ బౌలింగ్‌లో వికెట్లు ముందు బోల్తాపడ్డాడు.

తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ రివ్యూకెళ్లి ఫలితాన్ని రాబట్టింది. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 69 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చి కోహ్లీతో రోహిత్ బాధ్యాతాయుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో 56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ కెరీర్‌లో 44వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అంతకుమందు ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో రెండేసి పరుగులు చేసిన రోహిత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(56), విరాట్ కోహ్లీ(6) క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి ముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. లబుషేన్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Sunday, January 19, 2020, 19:13 [IST]
Other articles published on Jan 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+