న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్​లో నేను ఎదుర్కొన్న అత్యంత వేగవంతమైన ఓవర్ అదే: పాంటింగ్

Ricky Ponting recalls Shoaib Akhtars spell as the fastest ever he faced in Tests

మెల్‌బోర్న్: తన క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న బెస్ట్ ఓవర్ ఇంగ్లండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌‌దని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ వేసిన స్పెల్ ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు. అత్యంత వేగవంతమైన బంతులతో కూడిన ఆ స్పెల్‌‌ను మళ్లీ తన కెరీర్‌లో ఎప్పుడు ఎదుర్కోలేదన్నాడు.

అక్తర్ బౌలింగ్ ఇబ్బంది పెట్టింది..

అక్తర్ బౌలింగ్ ఇబ్బంది పెట్టింది..

1999లో పాక్‌ జట్టు తమ దేశంలో పర్యటించిందని, ఆ టూర్‌లో పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో అక్తర్‌ ప్రతీ బంతిని గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడని పాంటింగ్ గుర్తుచేసుకున్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తనకు వేసిన ఓ ఓవర్ తనకు అత్యుత్తమని ట్వీట్ చేసిన పాంటింగ్.. తాజాగా అక్తర్ స్పెల్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నాటి అక్తర్ స్పెల్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేశాడు.

‘నా కెరీర్‌లో ఫ్లింటాఫ్‌ వేసిన ఓవర్‌ను బెస్ట్‌ అని చెప్పిన తర్వాత నాపై ప్రశ్నల వర్షం కురిసింది. దీంతో నాకు అక్తర్‌ వేసిన స్పెల్‌ గుర్తుకువచ్చింది. ఈ స్పెల్‌లో ప్రతీ బంతి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాయి. వేసిన ప్రతీ బంతి నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అక్తర్‌ వేసిన ఈ ఫాస్టెస్ట్ స్పెల్ నేను ఎప్పటికి మరిచిపోను. నన్ను నమ్మండి.. నాకు అండగా జస్టిన్ కూడా నిలబడలేకపోయాడు' అంటూ ట్వీట్ చేశాడు.

వలస కూలీల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుంది: మహ్మద్ షమీ

బెస్ట్ ఓవర్ అదే

2005 యాషెస్ సిరీస్ జ్ఞాపకంగా అండ్రూ ఫ్లింటాఫ్ వేసిన ఓ ఓవర్ వీడియోను ఇంగ్లండ్​ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి రికీ పాటింగ్​ శుక్రవారం స్పందించాడు. 'నేను ఎదుర్కొన్న బెస్ట్ ఓవర్ ఇదే. గంటకు 90మైళ్ల వేగంతో క్లాస్ రివర్స్ స్వింగ్​' అని రికీ రిప్లై ఇచ్చాడు. తన కెరీర్​లో 2005 యాషెస్ బెస్ట్ సిరీస్​ అని పాంటింగ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2005,2009, 2010-11 యాషెస్ సిరీస్‌లు ఓడింది.

బోల్తా కొట్టించిన ఫ్లింటాఫ్

బోల్తా కొట్టించిన ఫ్లింటాఫ్

ఎడ్జ్​బాస్టన్ టెస్ట్​లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది. ఆపై ఆస్ట్రేలియా 308 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో షేన్ వార్న్ మాయ చేయడంతో ఇంగ్లండ్ కేవలం 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ లక్ష్యం 282 పరుగులుగా మారింది. ఆసీస్ ఓపెనర్లు 47 పరుగుల చేసి శుభారంభం అందించారు. ఫ్లింటాఫ్ తన తొలి ఓవర్లోనే ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాడు. ఆపై పాంటింగ్ క్రీజులోకి రాగా అద్భుతంగా బౌలింగ్ చేసిన ఫ్లింటాఫ్.. చివరి బంతిని అతన్ని పెవిలియన్ చేర్చాడు. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ కేవలం 2 పరుగుల తేడాతో గెలిచింది.

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌

బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా పాంటింగ్ ఆసీస్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. అతని సారథ్యంలో కంగారుల జట్టు 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2006 చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కూడా పాంటింగ్‌ గుర్తింపు పొందాడు. 228 మ్యాచ్‌ల్లో అతని సారథ్యంలో ఆసీస్ ఏకంగా 162 గెలుపొందింది. ఇక సంప్రదాయక ఫార్మాట్‌లో కూడా అద్భుత విజయాలు సాధించింది. 77 టెస్ట్ మ్యాచ్‌ల్లో 48 గెలుపొందింది.

Story first published: Wednesday, April 15, 2020, 18:55 [IST]
Other articles published on Apr 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X