న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వలస కూలీల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుంది: మహ్మద్ షమీ

Mohammed Shami Says A labourer travelling from Rajasthan to Bihar fainted in hunger near my home

కోల్‌కతా: కరోనా మీద మన్నువడ.. ఆ రోగమేందో గానీ కోట్ల మంది ఆకలితోనే చచ్చేట్టున్నారు. ప్రత్యేకించి వ‌లస కూలీల గోస చూస్తే కడుపు తరక్కుపోతుంది. బతుకుదెరువు కోసం సొంత ఊరు విడిచి నగరాలకు వచ్చిన కూలీలు.. కరోనా గత్తర పుణ్యమా పనుల్లేక పస్తులు ఉంటున్నారు. సొంతూరికిపోయి గంజో,నీళ్లో తాగి బతుకుదామనుకుంటే.. లాక్‌డౌన్‌తో దేశం మొత్తం రవాణ ఆగిపోయింది. దీంతో చేసేదేమి లేక.. వేల కిలో మీటర్లు దూరమని తెలిసినా.. కాలిబాట పట్టారు.

వలస కూలీల బాధ వర్ణాతీతం..

వలస కూలీల బాధ వర్ణాతీతం..

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న షమీ.. లాక్‌డౌన్ వల్ల దేశంలో నెలకొన్న దుర్భర స్థితిని, తన ఇంటి ముందే ఓ వలస కూలి పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చాడు.

‘దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో రవాణ సౌకర్యం లేక ఓ కూలి రాజస్థాన్ నుంచి బీహార్‌కు కాలినడకన బయల్దేరాడు. అతని ఊరు చాలా దూరమనే విషయం తెలిసినా గత్యంతరంలేక తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే అతను మా ఇంటి సమీపంలోకి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. నా ఇంటి సీసీ కెమెరాల్లో అతను పడిపోవడాన్ని నేను గమనించా. వెంటనే ఆకలితో అలమటించే అతడు పడిపోయాడని గ్రహించి ఆహారం అందించా. అలాగే నాకు తోచిన సాయం చేశా.

ఆకలితో అలమటించి..

ఆకలితో అలమటించి..

ఇలానే రాజస్థాన్ నుంచి బిహార్ బయలు దేరిన ఓ వలస కూలి తిండిలేక తన ఇంటి ముందు సొమ్మసిల్లి పడిపోయాడని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. అతనికి ఆహారం అందించి తనకు తోచిన సాయం చేశానన్నాడు. తన ఇళ్లు హైవేకు సమీపంగా ఉండటంతో వలస కూలీల అవస్థలు తనకు కనబడుతున్నాయని, వారి గోస చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 ప్రతీ ఒక్కరికి తోచిన సాయం చేస్తున్నా..

ప్రతీ ఒక్కరికి తోచిన సాయం చేస్తున్నా..

నాకు సాధ్యమైనంతలో ఇలా కనిపించిన ప్రతీ ఒక్కరికి సాయం చేస్తున్నా. ఈ లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు చాలా బాధపడుతున్నారు. వారి గోస చూస్తే కడుపుతరుక్కుపోతుంది. హైవేకు సమీపంలోనే మా ఇళ్లు ఉండటంతో వారి బాధలను నా కళ్లారా చూస్తున్నా. వారికి ఎలాగైనా సాధ్యమైనంత సాయం చేయాలని భావించా.'అని వలస కూలీల బాధను షమీ వివరించాడు.

ఈ లైవ్ సెషన్‌లో షమీ సరదాగా కూడా మాట్లాడాడు. ఈ క్వారంటైన్ సమయం క్రికెటర్లకు వంట నేర్చుకునేలా చేసిందని షమీ చెప్పుకొచ్చాడు. తాను వంట వండడం నేర్చుకుంటున్నానని, కిచెన్‌లో తన తల్లికి సాయం చేస్తున్నానని తెలిపాడు.

ఆ సమయంలో రక్తంతో ప్యాంట్ తడిసినా తెలియలేదు: షేన్ వాట్సన్

నా ఫేవరేట్ మూమెంట్..

నా ఫేవరేట్ మూమెంట్..

తన క్రికెట్ కెరీర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడమే ఫేవరేట్ మూమెంటనీ ఈ టీమిండియా పేసర్ పేర్కొన్నాడు. షమీ 2013లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఈ స్టార్ పేసర్ మొత్తం 9 వికెట్లు పడగొట్టి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

Story first published: Wednesday, April 15, 2020, 15:43 [IST]
Other articles published on Apr 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X