న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీ వదులుకోవడం బాధించింది: రికీ పాంటింగ్

Ricky Ponting breaks his silence on leaving captaincy after 2011 World Cup exit

2011 ప్రపంచకప్ నిష్క్రమణ తర్వాత ఆస్ట్రేలియా జట్టు సారథ్య బాధ్యతలు వదులుకోవడం‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తాజాగా స్పందించాడు. స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్సీ వదులుకోవడం తనను బాధించిందని కానీ అదే సరైన సమయమని భావించి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నానని తెలిపాడు.

]

భారత్ చేతిలో ఓడి..

భారత్ చేతిలో ఓడి..

అటు బ్యాట్స్‌మన్‌గా ఇటు కెప్టెన్‌గా పాంటింగ్ ఆసీస్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. అతని సారథ్యంలో కంగారుల జట్టు 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2006 చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కూడా పాంటింగ్‌ గుర్తింపు పొందాడు. 228 మ్యాచ్‌ల్లో అతని సారథ్యంలో ఆసీస్ ఏకంగా 162 గెలుపొందింది. ఇక సంప్రదాయక ఫార్మాట్‌లో కూడా అద్భుత విజయాలు సాధించింది. 77 టెస్ట్ మ్యాచ్‌ల్లో 48 గెలుపొందింది.

2021కి ఒలింపిక్స్‌ వాయిదా : జపాన్ ప్రధాని

 అనూహ్య నిర్ణయం

అనూహ్య నిర్ణయం

ఇక డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలో 2011 ప్రపంచకప్ బరిలోకి దిగిన పాంటింగ్ సేన ఆతిథ్య భారత్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీ ఓటమి అనంతరం పాంటింగ్ అనూహ్యంగా తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. దీంతో మైఖెల్ క్లార్క్ ఆసీస్ జట్టు పగ్గాలందుకున్నాడు. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ఇన్నాళ్లు నిశబ్ధంగా ఉన్న పాంటింగ్ తాజాగా స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై నోరువిప్పాడు.

బాధించింది..కానీ

బాధించింది..కానీ

సారథ్య బాధ్యతలు కోల్పోవడం బాధించిందా? అని ప్రశ్నించగా పాంటింగ్ అవునని సమాధానమిచ్చాడు. ‘కెప్టెన్సీ కోల్పోవడం బాధనిపించింది. కానీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి తనకు జట్టుకు అదే సరైన సంధర్భమనిపించింది. ఆస్ట్రేలియా తదుపరి మెగాటోర్నీలకు సన్నాహకాలు ప్రారంభించడానికి, కెప్టెన్‌గా మైఖెల్ క్లార్క్ పూర్తిగా సంసిద్దం కావడానికి తగిన సమయం అదే అని భావించి సారథ్య బాధ్యతలు వదులుకున్నా.'అని 45 ఏళ్ల పాంటింగ్ తెలిపాడు.

 యువ ఆటగాళ్ల కోసం..

యువ ఆటగాళ్ల కోసం..

ఇక కెప్టెన్సీ వదులుకున్నా.. యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండటం కోసం జట్టులో కొనసాగాలనుకున్నట్లు పాంటింగ్ తెలిపాడు. ‘ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో సెంచరీ చేసినంకా.. ఇక కొన్ని రోజులు ఆడుతానని చెప్పినప్పుడు కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండాలనే నేను మరికొద్ది రోజు ఆడాలనుకున్నా. 'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 24, 2020, 20:11 [IST]
Other articles published on Mar 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X