న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021కి ఒలింపిక్స్‌ వాయిదా : జపాన్ ప్రధాని

Japan PM Abe Says IOC chief Bach 100 percent agreed to postponing Tokyo Olympics to 2021

టోక్యో: కరోనా వైరస్ కారణంగా జూలైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని జపాన్‌ ప్రధాని షింజో అబేనే మంగళవారం అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది నిర్వహిస్తామని తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అంగీకరించిందని షింజో తెలిపారు. టెలిఫోన్ కాల్ ద్వారా ఐఓసీ ప్రెసిడెంట్‌ థోమస్ బాచ్‌‌కు ఈ విషయాన్ని తెలియజేశామని తమ ప్రతిపాదనకు ఆయన 100 శాతం ఒప్పుకున్నారని జపాన్ ప్రధాని స్పష్టం చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను రద్దు చేయమన్నారు.

2021 సమ్మర్‌లో పూర్తి ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. కరోనా వైరస్‌పై విజయానికి సాక్షిగా ఈ మెగా ఈవెంట్స్ జరుగుతాయన్నారు. ఇక షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య ప్రకటించింది. దీంతో 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఈ మెగా ఈవెంట్ వాయిదా పడినట్లైంది. దీంతో 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఈ మెగా ఈవెంట్ వాయిదా పడినట్లైంది.

Story first published: Tuesday, March 24, 2020, 19:15 [IST]
Other articles published on Mar 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X