న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్లెమింగ్ తీరు నచ్చలేదు.. రెండు మ్యాచ్‌లకే పక్కన పెట్టారు: అశ్విన్

Ravichandran Ashwin Says being dropped from Chennai Super Kings after 2 bad games in IPL 2010

చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఇచ్చే మద్దతు ఏ ఫ్రాంచైజీ ఇవ్వదని, పది మ్యాచ్‌ల్లో విఫలమైనా తుది జట్టులో స్థానం ఉంటుందని ఇటీవల ఆ టీమ్ ప్లేయర్ షేన్ వాట్సన్ తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ జట్టు కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్ ఆటగాళ్లకు అండగా ఉంటారని కూడా చెప్పాడు.

కానీ అదే ఫ్రాంచైజీకే సుదీర్ఘ కాలం ఆడిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యానని పక్కనబెట్టారని తెలిపాడు. 2009 సీజన్‌తో ఐపీఎల్‌‌లోకి అరంగేట్రం చేసిన అశ్విన్‌.. ఏడు సీజన్ల పాటు సీఎస్‌కేకే ప్రాతినిథ్యం వహించాడు. అందులో 2010, 2011 టైటిల్స్‌ను సీఎస్‌కే నెగ్గింది.

అది నాకు చెంపపెట్టు..

అది నాకు చెంపపెట్టు..

అయితే 2010 సీజన్‌ తన ఓవరాల్‌ కెరీర్‌కు ఒక చెంపపెట్టు అని అశ్విన్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్‌ఫో తరఫున కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పోడ్‌క్యాస్ట్ సాయంతో అశ్విన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా దశాబ్ద కాలం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న అశ్విన్‌.. తాను క్లిష్లమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపాడు. 2010 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ ప్రదర్శన చెత్తగా ఉండటంతో తనను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశారన్నాడు. దాని ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని ఈ ఆఫ్‌స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.

నా అభిప్రాయం మారింది..

నా అభిప్రాయం మారింది..

‘2010 సీజన్‌ నాకు ఒక చెంపపెట్టు. నేను జట్టు నుంచి ఉద్వాసనకు గురైనప్పుడు నాతో కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఏమీ మాట్లాడలేదు. అంతే కాకుండా నాకు అండగా కూడా నిలవలేదు. అది నేరుగా నా ముఖంపై కొట్టినట్లు అనిపించింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన ఒక మ్యాచ్‌లో రాబిన్‌ ఊతప్ప, మార్క్‌ బౌచర్‌లు నా బౌలింగ్‌ను చితక్కొట్టారు. అప్పటివరకూ టీ20ల్లో బౌలింగ్‌ ఇంత చాలెంజ్‌గా ఉంటుందని అనుకోలేదు. టీ20ల్లో వికెట్లు ఎక్కువ సాధించవచ్చని అప్పటివరకూ ఉన్న నా అభిప్రాయం తప్పని తేలింది.

ఇంటికి పంపించారు..

ఇంటికి పంపించారు..

ఆ మ్యాచ్‌లో నేను వికెట్లు తీయకపోగా 40 నుంచి 45 పరుగులు వరకు ఇచ్చా. ఆ తర్వాతి మ్యాచ్‌లో కూడా చెత్త గణాంకాలు నమోదు చేశా. సూపర్‌ ఓవర్‌కు వెళ్లిన ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. దాంతో నన్ను జట్టులో నుంచి తప్పించారు. ఈ విషయాన్ని కోచ్‌ చెప్పలేదు. నాకు మద్దతుగా నిలవలేదు కూడా. నేను హోటల్‌ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయా. అప్పుడు ఒక నిబంధన ఉండేది. హోమ్‌ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తొలి 18 ఆటగాళ్ల జాబితాలో లేని వారు ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. హోటల్‌ బిల్లులను సేవ్‌ చేయాలనే ఉద్దేశం అప్పుడు అలా ఉండేది. దాంతో ఇంటి దగ్గర ఉండే సీఎస్‌కే మ్యాచ్‌లు చూశా. నాకు సీఎస్‌కే ఎందుకు అండగా నిలవలేదు అనే బాధ ఉండేది.

ఓ మాటైనా చెప్పకుండా..

ఓ మాటైనా చెప్పకుండా..

నేను తొలి మూడు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ బాగా చేసా.. కానీ మిగతా రెండు మ్యాచ్‌ల్లో చెత్త గణాంకాలు నమోదు చేసే సరికి నాతో మాట కూడా చెప్పకుండా తప్పించారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఎంతటి గొప్ప బౌలర్‌ అయినా పరుగులు సమర్పించుకోవడం సాధారణం. 2010లో వెస్టిండీస్‌లో జరిగిన వరల్డ్‌ టీ20 ప్రాబబుల్స్‌లో కూడా నాకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత భిన్నమైన పిచ్‌ల్లో ఎలా బౌలింగ్‌ చేయాలనే విషయం నేర్చుకుంటూ ముందుకు సాగా.ఇంగ్లండ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటంతో నా స్పిన్‌ బౌలింగ్‌ మరింత మెరుగుపడింది. 2013-14 సీజన్‌లో దక్షిణాఫ్రికా పర్యటన కూడా నాకు కలిసొచ్చింది. స్పిన్‌లో రాటుదేలుతూ ముందుకు సాగా. సీఎస్‌కేతో ఉద్వాసన గురైనప్పుడు నాతో ఫ్లెమింగ్‌ వ్యహరించిన తీరు నాకు నచ్చలేదు. దాంతో నాలో పట్టుదల పెరిగింది' అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీని మించినోడు లేడు: ఆర్పీ సింగ్

Story first published: Monday, April 27, 2020, 16:20 [IST]
Other articles published on Apr 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X