Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీని మించినోడు లేడు: ఆర్పీ సింగ్

 ఇప్పటికీ మా స్నేహం అలానే..

న్యూఢిల్లీ: ఆటను అర్థం చేసుకోవడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మించినోడు లేడని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. తన కెరీర్‌లో ధోనీలాంటి సారథిని మరెవరినీ చూడలేదని ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ పేసర్ చెప్పుకొచ్చాడు. ఆదివారం భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఆర్పీసింగ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

మహీ కన్నా గొప్పవారిని చూడలేదు..

మహీ కన్నా గొప్పవారిని చూడలేదు..

‘ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీని మించిన కెప్టెన్‌ను నేను చూడలేదు. మైదానంలోని క్లిష్ట పరిస్థితులను కూడా తమవైపు మళ్లించుకోవడం.. దానికి తగ్గ వ్యూహాలు అమలు చేయడంలో మహీ కన్నా గొప్పవారిని నా కెరీర్‌లోనే చూడలేదు. అతను పరిస్థితులను చాలా భిన్నంగా చూస్తాడు.'అని ఆర్పీ సింగ్ కొనియాడాడు.

నా బెస్ట్ కెప్టెన్..

నా బెస్ట్ కెప్టెన్..

ఇక అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ నాయకత్వం గురించి మాట్లాడుతూ.. తాను ఆడిన సారథులల్లో అనిల్ కుంబ్లే బెస్ట్ కెప్టెన్ అని, ద్రవిడ్ టెక్నికల్ మాస్టర్ అని ఆర్‌పీ సింగ్ చెప్పుకొచ్చాడు. సౌరవ్ గంగూలీ అనంతరం కుంబ్లే, ద్రవిడ్ కొన్నాళ్లు కెప్టెన్సీ వహించగా.. 2007 టీ20 ప్రపంచకప్ విజయంతో ధోనీ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చెపట్టాడు. అతడి సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో టెస్ట్‌ల్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో ఆర్పీ సింగ్ కూడా ఓ సభ్యుడే. ఈ మెగాటోర్నీలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ పేసర్.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆర్పీసింగ్‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతను జట్టు నుంచి దూరమయ్యాడు.

 ఇప్పటికీ మా స్నేహం అలానే..

ఇప్పటికీ మా స్నేహం అలానే..

జాతీయ జ‌ట్టులోకి రాక‌ముందే మ‌హేంద్ర సింగ్ ధోనీ, ఆర్పీసింగ్‌ మంచి స్నేహితులు. దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించినా.. 2007, 2011 ప్రపంచకప్ , 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయాలతో ధోనీ కెరీర్ అమాంతం దూసుకుపోగా. . ఆర్పీసింగ్ మాత్రం పాతాళానికి పడిపోయాడు. తాజాగా ఇదే విషయంపై ఆర్పీసింగ్ మాట్లాడుతూ.. ‘మేం ఇద్దరం కలిసి చాలా సమయాన్ని గడిపేవాళ్లం, కబుర్లు చెప్పుకునేవాళ్లం, ధోనీ కెప్టెన్ అయిన తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్లింది. అదే సమయంలో నా కెరీర్ మాత్రం పడిపోయింది. కానీ మా మధ్య ఉన్న స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అప్పటిలానే మాట్లాడుకుంటాం.. కబుర్లు చెప్పుకుంటాం. కానీ క్రికెట్ విషయానికొస్తే మాత్రం మా మధ్య బేధాబ్రిపాయాలు ఉంటాయి'అని ఆర్పీ సింగ్ తెలిపాడు.

Story first published: Monday, April 27, 2020, 12:21 [IST]
Other articles published on Apr 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+