న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదేళ్ల తర్వాత.. రంజీ ట్రోఫీ నాకౌట్‌కు ఆంధ్ర

 Ranji Trophy 2019-20: After five years Andhra enter quarters

హైదరాబాద్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్‌కు చేరింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ చేతిలో ఓడినప్పటికీ.. క్వార్టర్‌ ఫైనల్స్‌‌కు క్వాలిఫై అయింది. శనివారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్రపై గుజరాత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

అక్షర్ పటేల్ ఏడు వికెట్లు..

అక్షర్ పటేల్ ఏడు వికెట్లు..

ఆట చివరి రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 216/7తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర 113.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్‌ బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ (7/92) ఏడు వికెట్లతో ఆంధ్ర పతనాన్ని శాసించాడు. అనంతరం 30 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో గుజరాత్‌ 18 జట్లున్న ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ అండ్‌ బి'లో 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది.

లంబూ లేచాడు.. న్యూజిలాండ్‌కు బయల్దేరాడు!!

ఇది నాలుగోసారి..

ఇది నాలుగోసారి..

ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి' గ్రూప్‌ నుంచి బెంగాల్‌ (32 పాయింట్లు), కర్ణాటక (31 పాయింట్లు), సౌరాష్ట్ర (31 పాయింట్లు), ఆంధ్ర (27 పాయింట్లు) జట్లు కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాయి. ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో నాకౌట్‌ దశకు చేరడం ఇది నాలుగోసారి.

గతంలో ఆంధ్ర జట్టు కె.ఎస్‌. భాస్కర మూర్తి సారథ్యంలో 1985-86 సీజన్‌లో... ఎమ్మెస్కే ప్రసాద్‌ కెప్టెన్సీలో 2001-02 సీజన్‌లో... మొహమ్మద్‌ కైఫ్‌ నాయకత్వంలో 2014-15 సీజన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ మూడు పర్యాయాలూ ఆంధ్ర పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. ఈనెల 20 నుంచి 24 వరకు ఒంగోలు వేదికగా జరిగే క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్రతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.

మార్చి 29 నుంచే ఐపీఎల్‌ షురూ.. హైదరాబాద్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

నాలుగు గెలిచి..

నాలుగు గెలిచి..

ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. రెండింటిని ‘డ్రా' చేసుకొని మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో హనుమ విహారి, రికీ భుయ్, శ్రీకర్‌ భరత్‌లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌లుగా వ్యవహరించారు.

హైదరాబాద్ ఫ్లాఫ్ షో..

హైదరాబాద్ ఫ్లాఫ్ షో..

ఇక హైదరాబాద్‌ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో చివరి మ్యాచ్‌ను ‘డ్రా'గా ముగించింది. కేవలం ఏడు పాయింట్లతో అట్టడుగున నిలిచి వచ్చే ఏడాది గ్రూప్‌ ‘సి'కి పడిపోయింది. గ్రూప్‌ ‘సి'లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జమ్మూ కశ్మీర్, ఒడిశా జట్లు వచ్చే ఏడాది ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి' గ్రూప్‌కు ప్రమోట్‌ అయ్యాయి. ‘సి'లో చివరి స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్‌ ప్లేట్‌ డివిజన్‌కు పడిపోయింది. ప్లేట్‌ డివిజన్‌లో అగ్రస్థానంలో నిలిచిన గోవా జట్టు గ్రూప్‌ ‘సి'కి ప్రమోట్‌ అయ్యింది.

క్వార్టర్‌ ఫైనల్స్‌ షెడ్యూల్‌ (ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు)

ఆంధ్ర vs సౌరాష్ట్ర (ఒంగోలు),

కర్ణాటక vs జమ్మూ కశ్మీర్‌ (జమ్మూ)

బెంగాల్‌ vs ఒడిశా (కటక్‌)

గుజరాత్‌ vs గోవా (వల్సాద్‌)

Story first published: Sunday, February 16, 2020, 14:56 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X