న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంబూ లేచాడు.. న్యూజిలాండ్‌కు బయల్దేరాడు!!

Ishant Sharma clears fitness Test, set to join India Test squad in Wellington

ముంబై: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత అభిమానులకు గుడ్ న్యూస్! గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ పేసర్ ఇషాంత్‌ శర్మ శనివారం ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమయ్యాడు. దీంతో అతను న్యూజిలాండ్‌ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని శనివారం బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.

<strong>మార్చి 29 నుంచే ఐపీఎల్‌ షురూ.. హైదరాబాద్ మ్యాచ్‌ ఎప్పుడంటే?</strong>మార్చి 29 నుంచే ఐపీఎల్‌ షురూ.. హైదరాబాద్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

నేడే న్యూజిలాండ్‌కు పయనం..

నేడే న్యూజిలాండ్‌కు పయనం..

ఈనెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్ట్‌ నేపథ్యంలో ఇషాంత్ నేడు(ఆదివారం) నేరుగా మ్యాచ్ వేదిక అయిన వెల్లింగ్టన్‌కు బయల్దేరుతాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో ముందు జాగ్రత్తగా బీసీసీఐ సెలక్టర్లు ఇషాంత్‌ పేరును కూడా చేర్చారు. అతను ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గితే భారత జట్టుతో కలుస్తాడని ప్రకటించారు.

రంజీ మ్యాచ్‌లో గాయం..

రంజీ మ్యాచ్‌లో గాయం..

విదర్భతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా జనవరి 20న ఇషాంత్‌ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఎంఆర్‌ఐ స్కాన్‌లో ‘గ్రేడ్‌ త్రీ టియర్‌'గా తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి, పునరావాస చికిత్స అవసరమని అప్పట్లో వైద్యులు తేల్చారు. దాంతో నేషనల్ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) చేరుకున్న ఇషాంత్‌ అక్కడే కఠోర సాధనతో ఫిట్‌గా మారాడు.

మెరిసిన పంత్, అగర్వాల్.. ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

థ్యాంక్స్ కౌశిక్..

ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ అయిన అనంతరం ఇందుకు సహకరించిన ఫిజియో ఆశిష్‌ కౌశిక్‌కు లంబూ ట్విటర్ వేదికగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘జనవరి 20న నాకైన చీలమండపై గాయంతో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ ఆశిష్ కౌశిక్ సహాయంతో ఆ గాయం నుంచి బయటపడ్డాను. స్కాన్లు చూసి కొద్దిగా భయపడ్డాను. కానీ ఫిట్‌నెస్ సాధించినందుకు సంతోషంగా ఉన్నాను. థ్యాంక్స్ ఆశిష్ కౌశిక్.'అంటూ ఇషాంత్ ట్వీట్ చేశాడు.

 100కు మరో నాలుగు..

100కు మరో నాలుగు..

13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 96 టెస్టులు ఆడిన ఇషాంత్‌ ‘సెంచరీ'కి కేవలం నాలుగు టెస్టుల దూరంలో ఉన్నాడు. అతను వంద టెస్టుల మైలురాయిని చేరుకుంటే కపిల్‌దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత పేస్‌ బౌలర్‌గా నిలుస్తాడు.

Story first published: Sunday, February 16, 2020, 10:34 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X