న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2020లో ఆ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు కష్టమే: రమీజ్ రాజా

Ramiz Raja Says Hardik Pandya and Kieron Pollard will struggle in IPL 2020

కరాచీ: కరోనా దెబ్బతో యూఈఏకి తరలి వెళ్లిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చగా పరుచుకున్న మైదానాల్లో అభిమానులకు కావాల్సిన మజాను అందించేందుకు జట్లన్నీ సిద్దమయ్యాయి. మరో 8 రోజుల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగే రసవత్తర పోరుతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్‌లో విధ్వంసక వీరులకు కష్టాలు తప్పవని, స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు.

స్పిన్ బౌలింగ్ ఆడేవారికి..

స్పిన్ బౌలింగ్ ఆడేవారికి..

నెమ్మదైన పిచ్‌లు గల యూఏఈలో స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడే ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌లు తడబాటుకు గురవుతారని ఈ పాక్ మాజీ బ్యాట్స్‌మన్ తెలిపాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన ఆటతో చెలరేగిన పొలార్డ్.. తాను సారథ్యం వహించిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. అంతటి సూపర్ ఫామ్‌ ఉన్న పొలార్డ్.. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్‌లో తడబడుతాడని రమీజ్ రాజా తన యూట్యూబ్ చానెల్ ‘క్రిక్ క్యాస్ట్ షో'లో చెప్పుకొచ్చాడు.

‘క్రిస్ లిన్, పొలార్డ్, పాండ్యా బ్రదర్స్ వంటి విధ్వంసక వీరులు తడబడతారు. హర్దిక్ పాండ్యా‌కు స్పిన్ బౌలింగ్‌ను చీల్చిచెండాటం వెన్నతో పెట్టిన విధ్య. కానీ ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆయా జట్ల ఎంపిక విభిన్నంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ కష్టమవుతుంది. మీరు చాలా వేరియేషన్స్ చూస్తారు.'అని తెలిపాడు.

ఖాళీ స్టేడియాల్లో ఖైదీల్లాగా...

ఖాళీ స్టేడియాల్లో ఖైదీల్లాగా...

ఇక ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నీ ఆటగాళ్లకు సవాల్‌‌గా మారనుందని ఈ పాక్ మాజీ క్రికెటర్ అన్నాడు. ముఖ్యంగా కిక్కిరిసిన ఈడెన్ గార్డెన్స్ మైదానాల్లో ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు ఇబ్బంది కలగనుందన్నాడు. ‘ఖాళీ మైదానాల్లో ఆడటం ఆటగాళ్లపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే బయో సెక్యూర్ వాతావరణం దాదాపు ఖైదీలా ఉంటూ ఉత్తమ ప్రదర్శన కనబర్చాలి. ఇది ఆటగాళ్లకు చాలా కష్టం. ఎందుకంటే ప్రేక్షకుల సందడి లేకుంటే ఐపీఎల్ అసంపూర్ణంగా ఉంటుంది.

పెద్ద జట్లకు సవాలే..

పెద్ద జట్లకు సవాలే..

సొంత మైదానాలకు దూరంగా ఆడటం పెద్ద జట్లకు ప్రతికూలం కానుంది. ఉదహారణకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రేక్షకులతో కిక్కిరిసిన ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆడటం అడ్వాంటేజ్. అలాగే ఆర్‌సీబీకి బెంగళూరులో ఆడటం ప్రయోజనకరం. కాబట్టి ప్రతికూల పరిస్థితులను ఆయా జట్లు ఎలా అధిగమిస్తాయనేది ఆసక్తికరం.'అని రమీజ్ రాజా తెలిపాడు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2020 సీజన్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే.

CSK జట్టులోకి ఇంగ్లండ్ సంచలన బ్యాట్స్‌మన్.. సురేశ్ రైనా ప్లేస్‌లో భర్తీ!

Story first published: Friday, September 11, 2020, 13:43 [IST]
Other articles published on Sep 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X