న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క ఇన్నింగ్స్‌తో జీవిత సత్యం చెప్పిన రాహుల్ తెవాటియా!

Rahul tewatia innings with kings XI Punjab is compared with truth about life

హైదరాబాద్: ఒకే ఒక ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా జీవిత సత్యాన్ని బోధించాడు. జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేమని, నిమిషాల వ్యవధిలోనే లైఫ్ మొత్తం మారిపోతుందని తన ఆటతో నిరూపించాడు. నిజానికి ఈ మ్యాచ్ ముందు వరకు రాహుల్ తెవాటియా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 అది ఒక్కటే అయితే..

అది ఒక్కటే అయితే..

అయితే ఇక్కడ సిక్స్‌లు కొట్టడం ఒక్కటే జరిగితే ఈ రోజు తెవాటియా గురించి ఇంత మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఎందుకంటే పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిన స్థితిలో.. యావత్ క్రికెట్ ప్రపంచం తనను ఓ విలన్ చూస్తున్న తరుణంలో అతను చెలరేగాడు. అవును.. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్నతొలి 19 బంతుల్లో 8 రన్స్ చేసిన తెవాటియా.. చివరి 12 బంతుల్లో 45 రన్స్ చేసి ఔరా అనిపించాడు.

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా మారినా మన మీద మనకు నమ్మకం ఉంటే విజయం దక్కుతుందని తెవాటియా చాటిచెప్పాడు. కాదు ఆడి చూపించాడు. అందుకే అతను హీరో అయ్యాడు. అయినా ఐపీఎల్ అంటేనే ఇది కదా.. అనామక ఆటగాళ్లను రాత్రికి రాత్రే స్టార్లను చేయడం..!

అదృశ్య శక్తి ఆవహించింది..

అదృశ్య శక్తి ఆవహించింది..

ఇక తెవాటియా ఇన్నింగ్స్‌పై యావత్ క్రికెట్ అభిమానులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ తెవాటియా ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.‘తెవాటియాను దేవత ఆవహించింది. క్రికెట్, జీవితం అంటే ఇదే. నిమిషాల వ్యవధిలోనే అంతా మారిపోతుంది'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘జీవితం అంటేనే ఇది..రెండు నిమిషాల వ్యవధిలోనే అంతా తారుమారవుతుంది'అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తెవాటియా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది.

కొండంత లక్ష్యాన్ని పంచుకున్నారు..

కొండంత లక్ష్యాన్ని పంచుకున్నారు..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 106) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్‌ రాహుల్‌ (54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 69) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్‌ తేవటియా (31 బంతుల్లో 7 సిక్సర్లతో 53 ) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

రాహుల్ తెవాటియా.. నిన్ను తక్కువ అంచనా వేసా క్షమించు: టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్

Story first published: Monday, September 28, 2020, 15:53 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X