న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓరి నీ ఏశాలో.. ఐపీఎల్ 2020లో కూర్చొని ఇమ్రాన్ తాహిర్‌కు అలువాటైనట్లుందిగా!

PSL 2020: Imran Tahir’s new style celebration against Karachi Kings becomes a meme content

కరాచీ: సౌతాఫ్రికా సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా అవకాశాలు అందుకోని ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్.. తాజాగా తన శైలికి భిన్నంగా సంబరాలు జరుపుకోని అభిమానులకు మీమ్ మెటరీయల్ అయ్యాడు. కరోనాతో ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాకిస్థాన్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. తనశైలికి భిన్నంగా కాలుమీద కాలు వేసుకొని సంబరాలు జరుపుకున్నాడు. దాంతో అభిమానులు అతనిపై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

పరుగెత్తడానికి బదులు..

మాములుగా తాహిర్ వికెట్ తీసినా.. క్యాచ్ పట్టినా రెండు చేతులు చాపి మైదానంలో పరుగు తీస్తూ సంబరాలు జరుపుకుంటాడు. తాహిర్ సెలెబ్రేషన్స్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా హడావిడి చేస్తాడు ఈ 41 ఏళ్ల సౌతాఫ్రికా స్పిన్నర్. అయితే శనివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో తాహిర్ తన శైలికి భిన్నంగా సంబరాలు జరుపుకున్నాడు. కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు ఓపెనర్ షార్జీల్ ఖాన్ డీప్ స్క్వేర్ లేగ్ దిశగా ఆడిన భారీ షాట్‌ను తాహిర్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే ఎప్పటిలా పరుగెత్తకుండా కాలు మీదు కాలు వేసుకొని కూర్చొని ఓ ఫోజ్ ఇస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

మొత్తానికి ఆపేసాడు..

ఇక తాహిర్ ఫోజుపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో బెంచ్‌లో కూర్చొని అలవాటైనట్లుందని ఒకరంటే.. మొత్తానికి ఉరుకుడు ఆపేసాడు భయ్యా అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఎక్కడైనా తాహిర్ ఇలానే కూర్చుంటాడని, ఆన్‌లైన్ బంక్ కొట్టిన స్టూడెంట్ పరిస్థితని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓ కీలక వికెట్ తీసిన తాహిర్.. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ముల్తాన్ సుల్తాన్స్ విజయాన్నందుకోలేకపోయింది.

ముల్తాన్ సుల్తాన్స్ ఇంటికే..

ముల్తాన్ సుల్తాన్స్ ఇంటికే..

ఇక ఐపీఎల్‌లో ఫస్ట్ టైమ్ ప్లే ఆఫ్స్ చేరకుండా తాహిర్ టీమ్ సీఎస్‌కే ఇంటికి చేరగా.. పీఎస్‌ఎల్‌లో తన టీమ్ ముల్తాన్ సుల్తాన్స్ కూడా రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో ఓడి ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. శనివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1‌లో గెలుపొందిన కరాచీ కింగ్స్ నేరుగా ఫైనల్ చేరగా.. లాహోర్ ఖలాండర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన పెష్వార్ జల్మీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో ముల్తాన్ సుల్తాన్స్‌పై ఖలాండర్స్ 25 పరుగులతో గెలుపొంది టైటిల్ ఫైట్‌కు సిద్దవ్వగా.. ముల్తాన్ సుల్తాన్స్ వెనుదిరిగింది. మంగళవారం జరిగే ఫైనల్లో కరాచీ కింగ్స్‌తో లాహోర్ ఖలాండర్ అమీతుమీ తేల్చుకోనుంది.

కరోనా తెచ్చిన కష్టం.. డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్!

Story first published: Monday, November 16, 2020, 15:06 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X